Minister Roja: లోకేశ్‌ను చూసి అందరూ నవ్వుతున్నారు.. రోజా సెటైర్
ABN, First Publish Date - 2023-09-27T11:57:25+05:30
రాష్ట్రపతిని టీడీపీ నేత నారా లోకేశ్ కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారని మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేశ్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవన్నారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ మండిపడ్డారు.
విజయవాడ: రాష్ట్రపతిని టీడీపీ నేత నారా లోకేశ్ (TDP Leader Nara lokesh) కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారని మంత్రి ఆర్కే రోజా (Minister RK Roja) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేశ్.. రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవన్నారు. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదంట అంటూ మండిపడ్డారు. లోకేశ్ ఢిల్లీలో మోడీ (PM Modi), అమిత్ షా (Amit shah) కాళ్ళు పట్టుకోవడానికి తిరుగుతున్నారని అన్నారు. అడ్డంగా దొరికిన చంద్రబాబును (TDP Chief Chandrababu naidu) కాపాడేందుకు ఎవరూ సిద్ధంగా లేరన్నారు. అందుకే మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబు స్కిల్ డెవలప్‌మెంట్ సహా అమరావతి, ఫైబర్ నెట్ వంటి అనేక స్కాంలు చేశారని ఆరోపించారు. ఇన్నర్ రింగ్ రోడ్డు లేదు కదా.. ఇంకా స్కాం ఎలా జరిగిందని లోకేశ్ అడుగుతున్నారని.. రోడ్డు వేయకముందే ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్‌మెంట్ పేరుతో దోచుకున్నారని మంత్రి ఆరోపించారు.
ఆరు నెలల్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని లోకేశ్ చెప్తుంటే అందరూ నవ్వుతున్నారని.. స్కాంలలో ఇరుక్కుని లోకేశ్ ఢిల్లీ పారిపోయారని ఎద్దేవా చేశారు. కాళ్ళ నుండి కళ్ళ వరకూ భయంతో వణికిపోతున్నారన్నారు. ఎర్రబుక్‌లో రాసుకుంటానని బెదిరిస్తున్న లోకేశ్.. సీఐడీ మెమోలో ఆయన పేరు రాసారని గుర్తు చేసుకోవాలన్నారు. హెరిటేజ్‌లో 2 శాతం షేర్లు అమ్మితేనే రూ.400 కోట్లు వస్తాయని భువనేశ్వరి చెప్తున్నారని.. అంటే చంద్రబాబు ఆస్తి 20 వేల కోట్లా అని ప్రశ్నించారు. చంద్రబాబు అఫిడవిట్‌లో ఆ విషయం స్పష్టం చేశారా అని నిలదీశారు. హైదరాబాద్‌లో చంద్రబాబు ఇల్లు 600 కోట్లు అని తలెిపారు. ప్రపంచ దేశాల్లోని తెలుగువారంతా ఈ స్కాంలను తెలసుకోవాలన్నారు. భువనేశ్వరి (Nara Bhuvaneshwari), బ్రహ్మణి (Brahmini) అబద్ధాలు చెప్తుంటే ఎన్టీఆర్ కూతురు, మనవరాలు అనే గౌరవం కూడా పోతోందన్నారు. చంద్రబాబు దోపిడీదారుడు అని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు టీమ్ వర్క్‌గా కుటుంబ సభ్యులంతా దోపిడీలో భాగస్వామ్యం అయినట్టు ప్రజలకు స్పష్టమైందని మంత్రి రోజా వ్యాఖ్యలు చేశారు.
Updated Date - 2023-09-27T11:57:32+05:30 IST