ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

MP Raghurama: ‘మోత మోగిద్దాం’కు ఎంపీ రఘురామ సంఘీభావం

ABN, First Publish Date - 2023-09-30T12:05:48+05:30

చంద్రబాబు నాయుడుకి మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, సతీమణి బ్రహ్మణి పిలుపునిచ్చిన ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమానికి ఎంపీ రఘురామ సంఘీభావం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా, రాజ్యాంగాన్ని నమ్మేవారు అందరూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని కోరారు.

న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడుకి (TDP Chief Chandrababu Naidu) మద్దతుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara Lokesh), సతీమణి బ్రహ్మణి (Brahmani) పిలుపునిచ్చిన ‘‘మోత మోగిద్దాం’’ కార్యక్రమానికి ఎంపీ రఘురామ కృష్ణరాజు(MP Raghurama Krishnaraju) సంఘీభావం తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా, రాజ్యాంగాన్ని నమ్మేవారు అందరూ చంద్రబాబుకు మద్దతు తెలపాలని కోరారు. ఒక వ్యక్తి కక్షతో చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని.. దాదాపు 20 రోజుల నుంచి జైల్లో ఉంచారన్నారు. త్వరలో చంద్రబాబు నాయుడు జైలు నుంచి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. మహిళాలోకం అందరూ కూడా మోత మోగిద్దాం కార్యక్రమానికి మద్దతు తెలపాలన్నారు. అప్రజాస్వామిక వాదులకు చెంపపెట్టు కావాలన్నారు. ఒక మద్యం షాపు కూడా తగ్గించకుండా రాష్ట్రంలో షాపులు పెట్టారని... షాపులకు లైసెన్స్ మరో ఏడాది పొడగించారన్నారు. మద్యం నిషేధం అన్నారని... చేయలేదన్నారు. రామ్ ఇన్ఫో అనే కంపెనీ వాలంటీరీలకు ట్రైనింగ్ ఇస్తారట.. సోషల్ మీడియాలో ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారని వ్యాఖ్యలు చేశారు. కొన్ని పోస్టులు పెట్టిన వారికి వైసీపీ సోషల్ మీడియా రివార్డ్ ప్రకటించారన్నారు. చిల్లర పైసలకు కక్కుర్తి పడొద్దని హితవుపలికారు. జగనన్న పాల ప్యాకెట్లు ఉబ్బి పేలిపోతున్నాయి అంటూ ఎంపీ రఘురామ కృష్ణరాజు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-30T12:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising