ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Raghurama Letter: చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉంది: రఘురామ

ABN, First Publish Date - 2023-04-22T13:39:43+05:30

ఏపీ ప్రతిపక్ష నేత,మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఏపీ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) ప్రాణాలకు ముప్పు ఉందని ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghuram KrishnamRaju) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి (PM Narendra Modi) రఘురామ లేఖరాశారు. ఏపీలో రాజకీయం హద్దులు దాటుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులను, కార్యకర్తలను దుర్మార్గంగా వేధిస్తున్నారంటూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిని ప్రధాని దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో చంద్రబాబు నాయుడు ర్యాలీ సందర్భంగా ఆయన వాహనంపై రాళ్లతో దాడి చేశారని లేఖలో తెలిపారు.

జెడ్ ప్లస్ కేటగిరీ సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను అడ్డుగా ఉంచి చంద్రబాబుకు రక్షణ కలిపించారన్నారు. చంద్రబాబును రక్షించే క్రమంలో ఎన్‌ఎస్‌జీ కమాండెంట్ సంతోష్ కుమార్‌కు గాయాలు అయ్యాయని లేఖలో తెలిపారు. చంద్రబాబు నాయుడును అడ్డుకుంటామని మంత్రి ఆదిమూలపు సురేష్ (Minister Adimulapu Suresh) మీడియాలో ప్రకటన చేశారని కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని అన్నారు. కావాలని ముందే మంత్రి సురేష్ షర్ట్ చింపేసుకొని వీధి పోరాటం చేశారని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు పోలీసులు ఎందుకు కలిపించలేదు అనే అంశాన్ని ఎంపీ రఘురామ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

Updated Date - 2023-04-22T13:39:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising