రైల్వే పనుల్లో నాణ్యతకు తూట్లు!
ABN , First Publish Date - 2023-11-24T23:38:03+05:30 IST
కావలి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో నాణ్యతకు తూట్లు పొడిచారు.

కావలి, నవంబరు 24: కావలి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల్లో నాణ్యతకు తూట్లు పొడిచారు. రైల్వే మూడో లైను నిర్మాణంలో భాగంటా కావలిలో. కొత్త భవనాలు, కొత్త ప్లాట్‌ఫారం నిర్మాణంతో పాటు స్టేషన్ ముందుభాగం ఆవరణ సైతం తారురోడ్డు, పార్కింగ్ టైల్స్‌తో అభివృద్ధి చేశారు. అయితే కాంట్రాక్టర్ చేతివాటం ప్రదర్శించడం, అధికారుల పర్యవేక్షణ కరువవడంతో స్టేషన్ ముందు ఆవరణంలో కొద్ది పాటి వర్షం వచ్చినా వర్షపు నీరు నిల్వ ఉండి స్టేషన్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారింది. అలాగే కొత్తగా నిర్మించిన ప్లాట్ ఫాంలో ఏర్పాటు చేసిన ప్రయాణికుల షెల్టర్ కూడా వర్షం వస్తే మధ్య డోన్ రేకుల వద్ద వర్షపు నీరు కారుతోంది. మూడో రైల్వే ట్రాక్‌లో రైళ్ల రాకపోకలకు అవసరమైన విద్యుత్ లైను కోసం ఏర్పాటు చేసిన ఇనుప విద్యుత్ స్తంభాలు ప్లాట్‌ఫాం నుంచి దాని చుట్టూ కొంత ఎత్తుగా ఇనుప మందమైన రేకు ఉండటంతో వర్షాకాలం ఆ మధ్యలో నీరు నిలుస్తుంది. దీనివలన ఆ స్తంభం కింద భాగం తుప్పు పట్టి దెబ్బతినే ప్రమాదం ఉంది. రైల్వే నాణ్యత, అభివృద్ధి దృష్ట్యా ఉన్నతాధికారులు వీటిని పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.