Share News

Narayana: మరో ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులే

ABN , Publish Date - Mar 01 , 2025 | 02:48 PM

Narayana: గత వైసీపీ ప్రభుత్వంలో కక్షసాధింపులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

Narayana: మరో ఆరు నెలల్లో అభివృద్ధి పరుగులే
Minister Narayana

నెల్లూరు, మార్చి 1: తప్పులు చేసిన వారిపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ (Minister Narayana) స్పష్టం చేశారు. శనివారం జిల్లాలో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై కక్ష సాధింపుతో వ్యవహరించారని.. అందులో తాను కూడా బాధితుడినే అని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తప్పు చేసిన వారిపైనే కేసులు నమోదవుతున్నాయన్నారు. గతంలో మాదిరిగా అర్ధరాత్రి అరెస్టులు చేయడం లేదని చెప్పారు. రాష్ర్ట అభివృద్ధికి శాంతి భద్రతలు ఎంతో ముఖ్యమన్నారు. దానిపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు నారాయణ. కొన్ని రోజులు ఆగితే అన్నీ వస్తాయన్నారు.


తల్లికి వందనం పథకం కూడా అమలు చేస్తారని తెలిపారు. ప్రతిపక్ష హోదా లేని వాళ్ళు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ బడ్జెట్ రూపొందించారని తెలిపారు. మునిసిపాలిటీలకు వివిధ రకాలుగా వచ్చే ఆదాయాన్ని ఆయా మునిసిపాలిటీలో అభివృద్ధికే వెచ్చిస్తామన్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిధులన్నీ సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్ళేవని...దీనివల్ల చిన్న పనులకు కూడా ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. 15 వ ఆర్థిక సంఘం నిధులను కూడా దారి మళ్లించారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకూ మంచి నీటి కుళాయిని ఇస్తామన్నారు. మూడేళ్ళలో ఈ పథకాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించిందని విమర్శిస్తూ.. దానిని గాడిలో పెడుతున్నామన్నారు. మరో ఆరు నెలల్లో అభివృద్ధి ఊపందుకుంటుందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Anitha: వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్


కాగా.. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలోని భగత్ సింగ్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి మరి మంత్రి నారాయణ పెన్షన్లు పంపిణీ చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ప్రతి నెలా 1వ తేదీ పండుగ వాతావరణం కనిపిస్తుందని... 60లక్షల మందికి ఫించన్లు అందుతున్నాయని మంత్రి తెలిపారు. జగన్ ఇంటింటికీ వెళ్లి ఫించన్లు ఇవ్వడం కుదరదని అన్నారని.. ఫించనుదారులని సచివాలయాలకు రమ్మన్నారని... ఆ సమయంలో కొందరు చనిపోయారని గుర్తుచేశారు. మరి ఇప్పుడు ఎలా వీలవుతుందని ప్రశ్నించారు. అనుభవం ఉన్న నేతకు, అనుభవం లేని నేతకు అదే తేడా అని చెప్పుకొచ్చారు.


అన్నా క్యాంటీన్లలో ప్రతి రోజు 2,25,000 మంది భోజనం చేస్తున్నారని.. జగన్ ఎందుకు మూతవేశారని ప్రశ్నిస్తూ... అదే సైకో మెంటాలిటీ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో పేద, నిరుపేదల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. జగన్‌కు రాష్ట ఆర్ధిక ప్రణాళిక తెలియదని.. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. ఖజానా ఖాళీ చేసి, రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని మంత్రి నారాయణ విమర్శించారు. ఈ కార్యక్రమంలో జేసీ కార్తీక్, కమిషనర్ సూర్యతేజ పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

Inter Exams: ఏపీలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

Anitha: వైసీపీ నేతలకు హోంమంత్రి అనిత స్ట్రాంగ్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 01 , 2025 | 02:48 PM