Share News

టిడ్కో గృహ సముదాయం వద్ద మినీ ఫంక్షన్‌ హాలు : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2023-11-03T22:58:36+05:30 IST

పట్టణంలోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు సమీపంలో గతంలో నిర్మించిన జీ ఫ్లస్‌ 3 గృహ సముదాయాల్లో 1120 గృహాలను శుక్రవారం లబ్ధిదారులకు అప్పగించారు.

టిడ్కో గృహ సముదాయం వద్ద మినీ ఫంక్షన్‌ హాలు : ఎమ్మెల్యే
3కెడికె2 : టిడ్కో గృహాల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి, అధికారులు

కందుకూరు, నవంబరు 3: పట్టణంలోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకు సమీపంలో గతంలో నిర్మించిన జీ ఫ్లస్‌ 3 గృహ సముదాయాల్లో 1120 గృహాలను శుక్రవారం లబ్ధిదారులకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఈ గృహాల నిర్మాణం అరకొరగా చేశారని, పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించి లబ్ధిదారులకు అప్పగించామన్నారు. ఇంకా మిగిలి ఉన్న గృహాలను కూడా అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి చర్యలు తీసుకుంటారన్నారు. టిడ్కో గృహ సముదాయంలో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి రూ.50 లక్షల మంజూరు చేసేందుకు నుడా అధికారులు అంగీకరించడంతో మరికొంత మున్సిపాలిటీ నిధులు జోడించి మినీ ఫంక్షన్‌హాలు కమ్‌ కమ్యూనిటీ బిల్డింగ్‌ నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడ్కో డైరెక్టర్‌ కానూరి నాగేశ్వరి, నుడా వైస్‌ చైర్మన్‌ టి.బాపిరెడ్డి, టిడ్కో ఎస్‌ఈ ఎం.చినకోటేశ్వరరావు, ఈఈ జి.వెంకటేశ్వరరావు, ఇన్‌చార్జి తహసీల్దారు ఆర్‌.బ్రహ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-11-03T22:58:38+05:30 IST