ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KotamReddy: ఏపీ సర్కార్‌ను ఇరకాటంలో పెట్టిన కోటంరెడ్డి

ABN, First Publish Date - 2023-02-16T11:18:29+05:30

ఏపీ ప్రభుత్వాన్ని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇరకాటంలో పెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: ఏపీ ప్రభుత్వాన్ని (AP Government) వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (YCP Rebal MLA KotamReddy SridharReddy) ఇరకాటంలో పెట్టారు. గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి‌దేవి ఆలయం ఉత్సవాలని నిర్వహించేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు. అయితే గత నలభై ఏళ్లగా అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు జరగడం లేదు. ఈక్రమంలో ఉత్సవాలకు అనుమతి ఇస్తే కోటంరెడ్డి (Kotamreddy SridharReddy)కి రాజకీయంగా ప్రయోజనమని జోరుగా చర్చలు జరుగుతున్నాయి. అయితే అనుమతి నిరాకరిస్తే ప్రజల్లో ప్రభుత్వం (Government)పై వ్యతిరేకత వస్తుందనే ఆందోళన నెలకొంది. దీంతో గ్రామదేవత ఉత్సవాలకు అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వ పెద్దలు, దేవాదాయ శాఖ రాష్ట్ర అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

అయితే... గత కొంతకాలంగా వైసీపీకి కోటంరెడ్డి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తన ఫోన్‌ను ప్రభుత్వం ట్యాపింగ్ (Phone Tapping) చేస్తోందని ఆరోపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే అది ఫోన్‌ ట్యాపింగ్ కాదని కాల్ రికార్డింగ్ అంటూ కోటంరెడ్డి స్నేహితుడు మీడియా ముఖంగా తెలియజేశారు. కావాలనే తన స్నేహితుడితో అలా చెప్పించారని కోటంరెడ్డి మండిపడ్డారు. స్నేహితుడితో బలవంతంగా చెప్పించారని ఆరోపించారు. ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ పక్కదారి పట్టిస్తున్నారని, తాను తప్పు చేసి ఉంటే సర్వనాశనం చేయాలని భగవంతుడిని కోరుకుంటున్నానని కోటంరెడ్డి చెప్పారు.

కాగా... వైసీపీకి, కోటంరెడ్డికి మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తారస్థాయికి చేరింది. ఓ క్రమంలో కోటంరెడ్డి భద్రతను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోటంరెడ్డికి ప్రభుత్వం కేటాయించిన 2 + 2 గన్‌మెన్ల (Gunmens)లో ప్రభుత్వం ఇద్దరిని తొలగించింది. దీనిపై కోటంరెడ్డి తనదైన రీతిలో స్పందించారు. తనకు ఎన్నో చోట్ల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని... ఈ విషయంలో భద్రతను పెంచాల్సిన ప్రభుత్వం గన్‌మెన్లను తగ్గించిందని మండిపడ్డారు. మిగిలిన ఇద్దరిని కూడా ప్రభుత్వానికే రిటర్స్ గిఫ్ట్ (Return Gift) ఇస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం తొలగించిన ఇద్దరితో పాటు మిగిలిన ఇద్దరిని తాను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. గన్‌మెన్లను తొలగించినంత మాత్రాన తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. అయితే కోటంరెడ్డిని విడిచి వెళ్లేందుకు ఆ ఇద్దరు గన్‌మెన్లు కంటతడి పెట్టారు. అన్నా నిన్ను విడిచి వెళ్లమన్నా అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. దీంతో కోటంరెడ్డి వారిద్దరి గుండెకు హత్తుకుని ఓదార్చారు.

ప్రతీసారి ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తున్న కోటంరెడ్డి తాజాగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పనికి పూనుకున్నారు. దీంతో గ్రామదేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి‌దేవి ఆలయం ఉత్సవాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-02-16T11:52:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising