Pawan Kalyan: వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే..
ABN , Publish Date - Dec 20 , 2023 | 07:49 PM
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద జరిగిన ‘యువగళం- నవశకం’.. సభలో ఆయన మాట్లాడారు.

విజయనగరం: ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే అని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం పోలిపల్లి వద్ద జరిగిన ‘యువగళం- నవశకం’.. సభలో ఆయన మాట్లాడారు. అవి ఆయన మాటల్లోనే..
‘‘చంద్రబాబును అన్యాయంగా జైలులో పెడితే బాధ కలిగింది. కష్టాల్లో ఉన్నప్పుడు సాయంగా ఉండాలని అనుకున్నా. ఏదో ఆశించి టీడీపీకి మద్దతివ్వలేదు. వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే. లోకేశ్‌ది మాటల పాదయాత్ర కాదు.. చేతలు చూపే పాదయాత్ర. ప్రజల సమస్యలు వింటూ లోకేశ్ పాదయాత్ర చేశారు. జగన్‌రెడ్డి పాలనలో ఏపీ సర్వనాశనమైంది. నాకు పాదయాత్ర చేసే అవకాశం లేనందుకు బాధగా ఉంది. లోకేశ్ చేసింది జగన్‌లాంటి పాదయాత్ర కాదు. దశాబ్ధ కాలం పాటు పార్టీని నడపాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు.. ముఖ్యమంత్రిని.
‘‘ఈ ముఖ్యమంత్రికి ప్రజాస్వామ్యం విలువ తెలియదు. ఇంట్లో ఉన్న తల్లికి, చెల్లిని విలువ ఇవ్వనివాడు మనకు ఎందుకు?. వైపీసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే దూషిస్తారా?. మా కార్యకర్తలపై దాడులు చేయిస్తారా?. ఒంటరి మహిళలు అన్యాయాలకు గురవుతున్నారు. వారాహి యాత్రలో నాపై దాడులు చేశారు. ఏపీ భవిష్యత్ నిర్మాణానికి పొత్తు ఉండాలి. ఏపీ భవిష్యత్తు నిలదొక్కుకునే వరకు పొత్తు ఉండాలి. టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందిస్తాం. టీడీపీతో సంయుక్తంగా కార్యక్రమాలు రూపొందిస్తాం. భవిష్యత్తు సభలో కార్యాచరణను విడుదల చేస్తాం. టీడీపీ- జనసేన మైత్రికి బీజేపీ ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నా’’.. అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.