ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu : ఆ పిచ్చోడి చేతికి రాయిస్తే ప్రజల్నే కొడుతున్నాడు

ABN, First Publish Date - 2023-08-06T23:21:08+05:30

ఏపీకి పట్టిన శని సీఎం జగన్‌రెడ్డి(CM Jagan Reddy).. ఆ పిచ్చోడి చేతికి రాయిస్తే ప్రజల్నే కొడుతున్నాడని తెలుగుదేశం(Telugu Desham) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లా(Prakasam District): ఏపీకి పట్టిన శని సీఎం జగన్‌రెడ్డి(CM Jagan Reddy).. ఆ పిచ్చోడి చేతికి రాయిస్తే ప్రజల్నే కొడుతున్నాడని తెలుగుదేశం(Telugu Desham) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. సైకో చేష్టలు ఏపీ(AP)కి శాపంగా మారాయని.. ఒక దుర్మార్గుడు అధికారం ఉందని ఏపీని నాశనం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పులివెందుల(Pulivendula)లో సైకో ఓడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. జగన్‌రెడ్డిది అసమర్థ, అవినీతి ప్రభుత్వమని చెప్పారు. ఏపీకి ఉన్న నీటి వనరులు ఏ రాష్ట్రానికీ లేవన్నారు. జగన్ సర్కార్‌(Jagan Sarkar) వచ్చాక రాష్ట్రంలో విధ్వంసం మొదలైందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడి చేసి.. వైసీపీ నేతలు(YCP leaders) బంద్‌కు పిలుపునిచ్చారని ధ్వజమెత్తారు.వైసీపీ వాళ్లంతా పెయిడ్ వర్కర్స్, పేటీఎం బ్యాచేనని ఎద్దేవ చేశారు. బాంబులకే భయపడలేదు.. రాళ్లకు భయపడతానా? అని చంద్రబాబు అన్నారు.ఏపీని కాపాడడానికి ఎంతకైనా తెగిస్తానని చెప్పారు.జగన్ సర్కార్‌కు ఎక్స్‌పైరీ డేట్ దగ్గర పడిందని చంద్రబాబు పేర్కొన్నారు.


ఏపీ ప్రజలు ఏం పోగొట్టుకున్నారో తెలుసుకుంటే.. అభివృద్ధిని మళ్లీ పునరుద్ధరించవచ్చన్నారు. ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ల(Irrigation Project)పై జగన్‌ సర్కార్‌ నిర్లక్ష్యం వీడాలని హితవు పలికారు. ప్రకాశం జిల్లా(Prakasam District)లో ప్రాజెక్టులకు రూ.68,293 కోట్లు ఖర్చుచేశామన్నారు. వైసీపీ సర్కార్‌ రూ.22,165 కోట్లే ఖర్చు చేసిందన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు(Gundlakamma project)కు గేట్లు పెట్టలేని అసమర్థ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు.ప్రాజెక్ట్‌ గేట్లు రిపేర్ చేయలేనివారు.. 3 రాజధానులు కడతారంట.. ప్రాజెక్ట్‌లకు పేర్లు పెట్టుకోవడంపై ఉన్న శ్రద్ధ.. పనులపై లేదని దుయ్యబట్టారు.పోలవరం(Polavaram) రాష్ట్రానికి ఒక వరమని.. రివర్స్ టెండర్(Reverse tender) పేరుతో పోలవరాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు.ఏపీలో 10 లక్షల టన్నుల వరి ఉత్పత్తి తగ్గిందని చెప్పారు.తెలంగాణలో 90 లక్షల టన్నుల వరి ఉత్పత్తి పెరిగిందన్నారు.తెలంగాణ కంటే ఏపీలోనే సాగుకు నీటి వినియోగం సులభమైందని చెప్పారు.అసమర్థ ప్రభుత్వం వల్లే ఏపీలో వరి ఉత్పత్తి తగ్గిందన్నారు.చెరువులు కబ్జా చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Updated Date - 2023-08-06T23:21:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising