ప్రతిఒక్కరికీ ‘సంక్షేమం’

ABN , First Publish Date - 2023-01-13T23:11:33+05:30 IST

రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

ప్రతిఒక్కరికీ ‘సంక్షేమం’

టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

మేదరమెట్ల, జనవరి 13: రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శుక్రవారం మేదర మెట్లలో రూ.1.40 కోట్లతో నిర్మించిన టీటీడీ కళ్యాణ మండపం, రూ.1.73 కోట్లతో నిర్మించిన పీహెచ్‌సీ భవనం, మేదరమెట్లలో రూ.60 లక్షలతో ఏ ర్పాటుచేసిన సెంట్రల్‌ లైటింగ్‌ల ప్రారంభం, రూ.1.70 కోట్లతో మేదరమెట్ల -దైవాలరావూరు మధ్య సీసీ రోడ్డు నిర్మాణం, జనజీవన్‌ మిషన్‌లో భాగం గా రూ.3.08 కోట్లతో మేదరమెట్లలో ఇంటింటికి తాగునీరు అందించే పథ కాలకు వైవీ సుబ్బారెడ్డి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శంకుస్థాపన చేశారు.

అనంతరం జరిగిన సభకు శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి నియోజక వర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అధ్యక్షత వహించగా, సుబ్బారెడ్డి మా ట్లాడారు. దేశంలో ఏరాష్ట్రంలో లేనటువంటి అభివృద్ధి, సంక్షేమ పథకాల ను జగన్మోహనరెడ్డి అమలుచేస్తున్నారన్నారు. గ్రామస్థాయి నుంచి ప్రభు త్వ అభివృద్ధి కార్యక్రమాలు జరుపుతున్నాన్నారు. ప్రతి పథకంలో పార దర్శకత, చెప్పిన సమయానికి పథకాలు పంపిణీ చేస్తు న్నట్టు చెప్పారు. కొరిశపాడు ఎత్తిపోతల పథకాన్ని త్వర లో పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యేలు చెంచుగర టయ్య, శివప్రసాదరెడ్డి, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొ మ్మూరి కనకారావు, వరప్రసాదరెడ్డి, చుండూరి రవి, ఎం పీపీ సాధినేని ప్రసన్నకుమారి, మేదరమెట్ల సర్పంచ్‌ బొనిగల ఎలీసమ్మ, కోయి అంకారావు, రావి శ్రీధర్‌, కాకాని రాధాకృష్ణమూర్తి, యర్రం రత్నారెడ్డి, సాధినేని మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

అవమానించారంటూ జడ్పీటీసీ ఆవేదన

మేదరమెట్లలో శుక్రవారం టీడీడీ కల్యాణమండప ప్రారంభోత్సవంలో తనకు కుర్చీ కూడా ఇవ్వకుండా అవమాననించారని కొరిశపాడు జడ్పీటీసీ తుళ్లూరి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు.

నూతలపాడులో టీటీడీ కల్యాణ మండపానికి శంకుస్థాపన

నూతలపాడు(పర్చూరు), జనవరి 13: పర్చూరు మండలం నూతల పాడు గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో తలపెట్టిన టీటీడీ కల్యాణ మండపం నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. టీటీడీ వేద పండితుల ఆధ్వర్యంలో వేదమంత్రాలతో శంకుస్థా పన కార్యక్రమాన్ని వైవీ చేతుల మీదుగా చేపట్టారు. ఈ సందర్భంగా వైవీ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో వెంకటేశ్వరస్వామి ఆలయాలు, కల్యాణ మండపాల నిర్మాణం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అందులోభాగంగానే నూతలపా డులో కల్యాణ మండపం ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు. కార్యక్రమం లో కల్యాణ మండప నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కుర్రి బాపిరెడ్డి, కార్యదర్శి రాజగోపాలరెడ్డి, సర్పంచ్‌ కాకర్లమూడి చిన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-13T23:11:40+05:30 IST