Business Ideas: పీఎం మోడీ చెప్పిన ఈ పంటకు పెట్టుబడి రూ.20వేలు.. రాబడి రూ.3-4లక్షలు..
ABN , Publish Date - Mar 03 , 2025 | 10:44 AM
Business Ideas : రైతులు ఏ పంట సాగు చేయాలన్నా కచ్చితంగా ఎరువులు కొనుగోలు చేయాల్సిందే. కానీ, ఈ పంటకు మాత్రం అవసరం లేదు. కేవలం రూ.20వేల పెట్టుబడితో లక్షల్లో లాభం పొందవచ్చని.. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీనే అన్నదాతలకు సూచించాడని తెలుసా.. మరి, ఆ వివరాలేంటో చూద్దాం..

Low Investment High Profit : మనదేశంలో నగరాలు, పట్టణాల కంటే పల్లెల్లోనే ఎక్కువమంది ప్రజలు జీవిస్తుంటారు. వీరిలో అధికశాతం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నవారే. దేశంలో అన్ని రంగాల్లోని వారు ఆర్థికంగా వృద్ధి సాధిస్తున్నా.. అన్నదాతల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టు అక్కడే ఉంది. రాబడితో పాటే పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతూ కష్టానికి తగ్గ ఫలితం పొందలేకపోతున్నారు. అయితే, రైతులు కేవలం రూ.20వేల పెట్టుబడితో ఒక్కసారి ఈ పంటను వేసుకుంటే చాలు. సులభంగా రూ.3-4 లక్షల ఆదాయం వస్తుంది. అదెలాగో ఈ కథనంలో తెలుసుకుందాం..
ప్రధాని చెప్పినట్లు.. మీ పంట పండుతుంది..
ఈ పంట సాగు చేయడానికి ఎరువులు అవసరంలేదని స్వయంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల మన్ కీ బాత్ ద్వారా రైతులకు సూచించారు. తక్కువ పెట్టుబడితో నిమ్మగడ్డి సాగు చేసి చాలామంది రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నట్లు పేర్కొన్నారు. మరి, నిమ్మ గడ్డి సాగు చేశాక ఎలా మార్కెట్ చేసుకోవాలి. ఏఏ రంగాల్లో వీటికి డిమాండ్ ఉంది.. ఈ పంటసాగు చేస్తే ఎంత డబ్బు సంపాదించవచ్చు తదితర విషయాల గురించి మీకు చెప్తాం.
కరవు నేలలోనూ సాగు చేయండి.. లక్షలు పొందండి..
నిమ్మగడ్డి సాగు చేయడానికి మొదట కేవలం రూ.20,000 పెట్టుబడిగా పెడితే చాలు. ఫిబ్రవరి, జూలై మధ్య సమయం పంట నాటుకునేందుకు అనుకూలం. ఒక్కసారి విత్తితే 5-6 సంవత్సరాల వరకూ దిగుబడి వస్తుంది. ఒక ఏడాదిలో ఏడాదిలో 6 నుంచి 7 సార్లు కోతకు వస్తుంది. దీన్ని పండించడానికి ఎరువులు అవసరం లేదు. అడవి జంతువులు ధ్వంసం చేస్తాయేమో అనే ఆందోళనా ఉండదు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పంటను కరవు ప్రభావిత ప్రాంతాల్లో కూడా సాగు చేయవచ్చు. ఉదాహరణకు 1 హెక్టారులో నిమ్మగడ్డి పంట వేస్తే సంవత్సరం తిరక్కుండానే సుమారు రూ.4లక్షల లాభం చేతికొస్తుంది.
నిమ్మగడ్డికి ఎంత డిమాండ్ ఉందంటే..
నిమ్మగడ్డి నుంచి తయారుచేసిన నూనెకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. దీనిని సబ్బులు, నూనెలు, సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీకి వినియోగిస్తారు. ఒక లీటరు నిమ్మనూనె ధర రూ.1000 నుంచి రూ.1500లు ఉంటుంది. ఒక ఏడాదిలో హెక్టార్ భూమిలో 100-150 కిలోల నిమ్మగడ్డిని వస్తుంది. దీని ద్వారా దాదాపు 325 లీటర్ల నూనెను ఉత్పత్తి చేయవచ్చు. ఏటికేడు దీని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఇలా మీరు ప్రతి సంవత్సరం ఈజీగా 4 నుంచి 5 లక్షలు ఆదాయం పొందవచ్చు.
Read Also : ఇండియాలో పోటీలేని టాప్ బిజినెస్ ఇదే.. తక్కువ ఖర్చు.. అధిక లాభాలు..
2034 నాటికి రూ.190 లక్షల కోట్లకు..
ఉద్యోగాల వృద్ధి బారెడు.. జీతాల వృద్ధి చారెడు