సాగర తీరంలో బీచ్ సందర్శకుల సందడి
ABN , First Publish Date - 2023-01-18T01:17:09+05:30 IST
కాకినాడ సాగరతీరం సందర్శకుల రద్దీతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట బీచ్‌కు తరలివస్తున్నారు.

సర్పవరం జంక్షన్, జనవరి 17: కాకినాడ సాగరతీరం సందర్శకుల రద్దీతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సందర్శకులు కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట బీచ్‌కు తరలివస్తున్నారు. దాంతో సాగరతీరంలో గత మూడు నాలుగు రోజులుగా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సముద్రతీరం సందర్శకులతో కిటకిటలాడుతోంది. పండుగ సెలవురోజులు కావడంతో వేలాది మంది బీచ్‌కు తరలివచ్చి కుటుంబ సభ్యులతో ఆనందంగా బీచ్‌లో ఉల్లాసంగా గడు పుతున్నారు. మంగళవారం కూడా బీచ్‌లో రద్దీ కొనసాగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్నా,పెద్దా తారతమ్యం లేకుండా ఆటపాటలతో చిన్నారులు ఉత్సాహంగా గడిపారు. పెద్దలు, యువత, మహిళలు సము ద్రంలో జలకాలాడారు. సందర్శకుల రద్దీ నేపథ్యంలో మెరైన్ సీఐ సుమంత్ ఆదేశాల మేరకు సిబ్బంది బీచ్‌లో గజఈతగాళ్లతో పహారా ఏర్పాటుచేసి హెచ్చరికలు చేస్తూ అప్రమత్తం చేశారు. ఉప్పాడ రోడ్డులో వాహనాల రద్దీతో ట్రాఫిక్ స్తంభించడంతో ట్రాఫిక్ సీఐ డీఎస్ చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో వాహనాలను దారిమళ్లించారు.