Sajjala: ఆర్థిక వ్యవహారాలు పక్కన పెట్టి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తున్నాం
ABN, First Publish Date - 2023-03-07T19:59:57+05:30
ధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపై (Andhra Pradesh State Employees Problems) చర్చించామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (AP government adviser Sajjala Ramakrishna Reddy) అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల సమస్యలపై (Andhra Pradesh State Employees Problems) చర్చించామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (AP government adviser Sajjala Ramakrishna Reddy) అన్నారు. ఏపీ ప్రభుత్వ విజన్ సాధనలో ఉద్యోగుల భాగస్వామ్యం ఉండాలని ఆయన చెప్పారు. కోవిడ్ కారణంగా ఆర్ధికంగా దెబ్బతిన్నామని ప్రభుత్వ సలహాదారు సజ్జల స్పష్టం చేశారు. సమయానికి సర్ప్లస్ బడ్జెట్ లేక కొంత అసంతృప్తి ఉందని, ఆర్థిక వ్యవహారాలు పక్కన పెట్టి ఉద్యోగుల కనీస సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. ఇవాళ చర్చలకు అంత ప్రాధాన్యం ఉందనుకోలేదని, ఉద్యోగుల సమస్యలు చాలా వరకు తీర్చే ప్రయత్నం చేశామని సజ్జల వెల్లడించారు. మార్చి 31లోపు బకాయిలన్నీ చెల్లిస్తామని మంత్రి వర్గ ఉపసంఘం పేర్కొంది. కేబినెట్ సబ్ కమిటీతో ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
వైసీపీ ప్రభుత్వంపై (YCP Govt) ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు (Bopparaju) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు 1వ తేదీనే జీతాలు చెల్లిస్తున్నారని బొప్పరాజు మండిపడ్డారు. మరి ఉద్యోగులకు 1వ తేదీనే ఎందుకు జీతాలు వేయడం లేదు? వైసీపీ ప్రభుత్వాన్ని బొప్పరాజు ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయానికే పెన్షన్ ఇస్తున్నారని, ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేయమంటే మాత్రం మాట్లాడటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏ హామీ ఇచ్చినా లిఖితపూర్వకంగానే ఇవ్వాలని బొప్పరాజు స్పష్టం చేశారు. మంత్రుల కమిటీ ఏం చెబుతుందో చూస్తామని, అప్పటివరకూ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ అన్నారు.
Updated Date - 2023-03-07T20:01:34+05:30 IST