ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu news: చంద్రబాబు అరెస్టుపై స్పందించనంటూనే స్పీకర్ సీతారాం చేసిన వ్యాఖ్యలివీ..

ABN, First Publish Date - 2023-10-01T13:30:22+05:30

స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై (Chandrababu arrest) స్పందించాల్సిన అవసరంలేదనంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడారు. క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. ఇంకా దర్యాప్తు పూర్తవ్వకుండా, కనీసం కోర్టుల్లో కూడా ఎటూ తేలకముందే బాధ్యతాయుత స్పీకర్ పదవిలో ఉండి క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

తిరుమల: స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై (Chandrababu arrest) స్పందించాల్సిన అవసరంలేదనంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం బాధ్యతారాహిత్యంగా మాట్లాడాడారు. క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించారు. ఇంకా దర్యాప్తు పూర్తవ్వకుండా, కనీసం కోర్టుల్లో కూడా ఎటూ తేలకముందే బాధ్యతాయుత స్పీకర్ పదవిలో ఉండి క్రిమినల్‌ని అరెస్ట్ చేశారని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.


కాగా తిరుమల శ్రీవారిని స్పీకర్ తమ్మినేని సీతారాం దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ సభ్యులు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరుని ప్రజలందరూ చూశారని, టీడీపీ సభ్యుల ప్రవర్తనను మీడియా సమర్థిస్తుందా? అని ఎదురుప్రశ్నించారు. శృతిమించిన వ్యవహారాన్ని ప్రజలు క్షమించరని సీతారాం అన్నారు. గతంలో ఎందరో ప్రతిపక్ష సభ్యులు.. అసెంబ్లీలో ఎంతో గౌరవప్రదంగా వ్యవహారించారని, ప్రతిపక్ష సభ్యులు వేసే ప్రశ్నలకు ప్రభుత్వానికి నరాలు తెగిపోయేవని అన్నారు. రాజకీయాలు చౌకబారు అయ్యాయాంటూ మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు నిజమేనని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ప్రజాధనాన్ని లూటీ చేసిన ఎందరో రాజకీయ నాయకులని గతంలో అరెస్ట్ చేశారని తమ్మినేని సీతారాం అన్నారు.

Updated Date - 2023-10-01T13:30:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising