ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TDP: పోలీసుల అదుపులో ఉన్న నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు.. ఆయన ఎక్కడ ఉన్నారో చెప్పాలని టీడీపీ ఆందోళన

ABN, First Publish Date - 2023-03-22T17:51:53+05:30

నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు (Chadalavada Aravinda Babu)ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకు పోలీసులు అచూకీ చెప్పలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పల్నాడు జిల్లా (Palnadu District): నరసరావుపేట టీడీపీ ఇన్చార్జ్ అరవింద్ బాబు (Chadalavada Aravinda Babu) ఎక్కడ ఉన్నారో ఇప్పటి వరకు పోలీసులు అచూకీ చెప్పలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చదలవాడ అరవింద్ బాబు ఆచూకీ కోసం టీడీపీ (TDP) నేతలు ఆందోళన చెందుతున్నారు. ఉదయం 11 గంటలకు చదలవాడను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని టీడీపీ నేతలు తెలిపారు. వ్యక్తిగత సిబ్బందిని సైతం రానివ్వకుండా అరవింద్ బాబును పోలీసులు జీప్లో తీసుకెళ్లారు. పోలీసుల తీరు పట్ల టీడీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

ఉదయం నుంచి నరసరావుపేట (Narasaraopet)లో టెన్షన్ (Tension) వాతావరణం నెలకొంది. చదలవాడ అరవిందబాబును పోలీసులు అరెస్టు చేశారు. కోటప్పకొండకు (Kotappakonda) వెళ్లేందుకు బయులుదేరిన ఆయనను అనుమతి లేదంటూ అదుపులోకి తీసుకుని.. బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. పోలీసులు - ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

నరసరావుపేటలో సవాళ్ల రాజకీయం (Challenges Politics) తారస్థాయికి చేరుకుంది. నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే గోపిరెడ్డి (MLA Gopireddy), టీడీపీ నేత అరవిందబాబు మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. కోటప్పకొండలో త్రికుటేశ్వరుని సాక్షిగా బహిరంగ చర్చ (Open Discussion)కు సిద్ధమంటూ నేతలిద్దరూ బహిరంగ సవాళ్లు విసురుకున్నారు. ఎమ్మెల్యే గోపిరెడ్డి అరాచకాలను నిరూపిస్తానంటూ టీడీపీ నేత అరవిందబాబు కోటప్పకొండకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీనికి అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

నాలుగేళ్లుగా నరసరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడుతూ.. టీడీపీ శ్రేణులను హత్యలు చేయిస్తున్నారని చదలవాడ అరవిందబాబు ఆరోపించారు. ఇటీవల రొంపిచర్ల మండలపార్టీ అధ్యక్షుడు బాలకోటి రెడ్డిని ఎమ్మెల్యేనే హత్య చేయించారని అరవిందబాబు చేసిన వ్యాఖ్యలపై గోపిరెడ్డి స్పందించారు. దమ్ముంటే ఆధారాలు చూపించాలని చేసిన సవాల్‌ను టీడీపీ నేతలు స్వీకరించారు. తాము ఇవాళ కోటప్పకొండ త్రికుటేశ్వరుని సన్నిధికి వెళతామని, ఎమ్మెల్యేకు దమ్ముంటే రావాలని.. అక్కడే అవినీతి, అక్రమాలను ఆధారలతో సహా నిరూపిస్తామని అరవిందబాబు సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఆయన బుధవారం ఉదయం కోటప్పకొండకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.

Updated Date - 2023-03-22T17:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising