Bonda Uma: తాడేపల్లి దేవస్థానానికి శ్రీవాణి ట్రస్ట్ నిధులు.. బోండా ఉమ సంచలన ఆరోపణలు
ABN, First Publish Date - 2023-06-23T13:18:57+05:30
శ్రీవాణి ట్రస్టు నిధులపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్టుకొచ్చే సగం నిధులను తాడేపల్లి దేవస్థానానికి తరలిస్తున్నారంటూ టీడీపీ నేత బోండా ఉమ సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక టీటీడీ పవిత్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
అమరావతి: శ్రీవాణి ట్రస్టు నిధులపై (Srivani Trust Funds) టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman YV Subbareddy) విడుదల చేసిన శ్వేతపత్రంపై టీడీపీ కౌంటర్ ఇచ్చింది. శ్రీవాణి ట్రస్టుకొచ్చే సగం నిధులను తాడేపల్లి దేవస్థానానికి తరలిస్తున్నారంటూ టీడీపీ నేత బోండా ఉమ (TDP Leader bonda Uma) సంచలన ఆరోపణలు చేశారు. జగన్ ప్రభుత్వం (Jagan Government) వచ్చాక టీటీడీ (TTD) పవిత్రత ప్రశ్నార్థకంగా మారిందన్నారు. టీటీడీని ఓ ఆదాయ వనరుగా మార్చారని తెలిపారు. లడ్డూ ధరలు పెంచారని.. గదుల అద్దెలని పెంచేశారని మండిపడ్డారు. కొండ మీద జరుగుతోన్న దుర్మార్గాలు ఆ భగవంతుడికే తెలియాలన్నారు. జగన్ ప్రభుత్వం వచ్చాక.. శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేశారని.. ఈ ట్రస్ట్ ద్వారా రోజుకు వేయి టిక్కెట్లకు పైగా అమ్ముతున్నారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టుకు వచ్చే నిధులపై అనేక అనుమానాలు ఉంటున్నాయన్నారు. శ్రీవాణి టిక్కెట్లను ఆఫ్ లైనులో అమ్ముతున్నారని ఆరోపించారు. సామాన్యులు వెళ్లే రూ.300 టిక్కెట్లకు ఆఫ్లైను సదుపాయం లేదని... కానీ రూ. 10 వేలు ధర ఉన్న శ్రీవాణి టిక్కెట్లను ఆఫ్ లైనులో ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించారు. కొన్ని ఎయిర్ పోర్టులో.. కొన్ని కొండ మీద.. కొన్ని ఆన్లైన్లో శ్రీవాణి టిక్కెట్లను అమ్ముతున్నామని చెబుతున్నారన్నారు. రోజుకూ వేయి టిక్కెట్లే అమ్ముతున్నారో.. 1500 టిక్కెట్లు అమ్ముతున్నారో ఎవరికి తెలుసని టీడీపీ నేత అన్నారు.
ఏడు కొండలను ఐదు కొండలు చేస్తామన్నవారు ఏమయ్యారో తెలుసుకోండి...
సుబ్బారెడ్డి చెప్పిన లెక్కల ప్రకారమే రోజుకు వేయి టిక్కెట్లు అమ్మితే.. నాలుగేళ్లల్లో సుమారు రూ.1500 కోట్లు రావాలని.. కానీ వైట్ పేపర్లో మాత్రం రూ.860 కోట్లే అంటున్నారన్నారు. శ్రీవాణి పేరుతో సగం డబ్బులు కొట్టేశారా అని ప్రశ్నించారు. శ్రీవాణి ట్రస్టు నిధులు సుమారు రూ. 700 కోట్లను తాడేపల్లి దేవస్థానానికి తరలించారా అని నిలదీశారు. ‘‘వైసీపీ ఎమ్మెల్యేల రాజకీయం కోసం శ్రీవాణి నిధులను వెచ్చిస్తారా..?. సమ్రస్తా అనే ఫౌండేషనుకే గుళ్లు కట్టమని నిధులిచ్చారు..?. సమ్రస్తా ఫౌండేషనుకున్న క్రెడిబులిటీ ఏంటీ..? ఆ సంస్థకే నిధులు ఎందుకిచ్చారు..?. తెలంగాణలో భూముల సెటిల్మెంట్ల కోసం పక్క రాష్ట్రాలకు స్వామి వారి నిధులిస్తారా..?. మేం అడక్కుండానే సుబ్బారెడ్డి నిధులిచ్చారని కేటీఆర్ చెప్పారు. లాబీయింగ్ చేసుకోవడానికి ఫ్లైటులేసుకుని వెళ్తారా..?. శ్రీవాణి ట్రస్టు నిధులా..? వైసీపీ డబ్బులా..?. శ్రీవాణి ట్రస్టు నిధులపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలి. శ్రీవాణి ట్రస్టుపై విమర్శలు చేస్తే కేసులు పెడతారా..?. శ్రీవాణి ట్రస్టు విరాళాలిచ్చే వారి పేర్లు వెబ్ సైటులో పెట్టండి. పింక్ డైమండ్ కొట్టేశారన్న విజయసాయి రెడ్డి మీద ఏం కేసులు పెట్టారు..?. భక్తులు డబ్బులేమయ్యాయంటే కేసులు పెడతారా..?. స్వామి వారితో పెట్టుకున్న వాళ్లు ఇక్కడ లేరు గుర్తు పెట్టుకోండి. ఏడు కొండలను ఐదు కొండలు చేస్తామన్నవారు ఏమయ్యారో తెలుసుకోండి. కాంట్రాక్టుల కోసం.. బెయిళ్ల కోసం స్వామి వారిని అడ్డం పెట్టుకుంటారా..?’’ అంటూ బోండా ఉమా మండిపడ్డారు.
పింక్ డైమంట్ సంగతేంటి?..
టీడీపీ నేత ఇంకా మాట్లాడుతూ.. ‘‘మేం అన్నదానం ట్రస్ట్.. ప్రాణదానం ట్రస్టులను ఏర్పాటు చేశాం. డీడీలు.. బ్యాంక్ చెక్‌ల ద్వారానే నిధులను మా హయాంలో తీసుకున్నారు. నగదు తీసుకుని టిక్కెట్లిస్తే ఎలా లెక్కల్లోకి వస్తుంది..?. శ్రీవాణి ట్రస్ట్ ముఖ్య ఉద్దేశ్యం జీర్ణావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్దరణ. ఏపీలో జీర్ణావస్థలో ఉన్న గుళ్లు లేవా..?. పక్క రాష్ట్రాల్లో ఉన్న దేవాలయాలకు అమ్మడమేంటీ..?. మా హయాంలో పింక్ డైమండ్ పోయిందన్నారు..? చంద్రబాబు కొట్టేశామన్నారు. మరి పింక్ డైమండ్ సంగతి ఏమైంది..? ఏం చేశారు..?. పింక్ డైమండ్‌పై మేం అధికారంలో ఉన్నప్పుడు కోర్టులో కేసు వేశాం.. అధికారంలోకి వచ్చాక ఆ పిటిషన్‌ను ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు..?. వెంకన్నను రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నారా..?. ధర్మారెడ్డి అతి పెద్ద లాబీయిస్టు అని ప్రచారం జరుగుతోంది. సీఎం జగనుకే స్వామివారిపై భక్తి లేదు. దంపత సమేతంగా స్వామి వారికి సమర్పించాల్సిన పట్టు వస్త్రాలను సమర్పించాలి కానీ.. జగన్ ఏ రోజూ అలా చేయలేదు. నేను ఏక లింగం అంటూ జగన్ ఒక్కరే వెళ్లి స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇస్తారు. ఇందిరా, సోనియా డిక్లరేషన్ ఇచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు’’ అంటూ బోండా ఉమా పేర్కొన్నారు.
Updated Date - 2023-06-23T13:18:57+05:30 IST