Lokesh: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై లోకేష్ దిగ్భ్రాంతి
ABN , Publish Date - Dec 15 , 2023 | 03:09 PM
Andhrapradesh: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అమరావతి: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మృతిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానన్నారు. శాసనమండలిలో వినిపించే ప్రజల గొంతు మూగబోయిందన్నారు. ఉపాధ్యాయుల హక్కుల పోరాటయోధుడు షేక్ సాబ్జీకి నివాళులర్పిస్తున్నానని.. వారి కుటుంబ సభ్యులకు లోకేష్ ప్రగాఢ సంతాపం తెలియజేశారు.