Share News

TDP: రైతులను మోసగించారంటూ వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డిపై టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫైర్

ABN , Publish Date - Dec 23 , 2023 | 06:31 PM

అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో రైతులను వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డి మోసగించారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని కృష్ణారెడ్డి తెలిపారు.

TDP: రైతులను మోసగించారంటూ వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డిపై టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఫైర్

తూర్పుగోదావరి జిల్లా: అనపర్తి మండలం కుతుకులూరు గ్రామంలో రైతులను వైసీపీ కార్యకర్త కృష్ణారెడ్డి మోసగించారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులు ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడ్డారని కృష్ణారెడ్డి తెలిపారు. సుమారు రూ. 5 కోట్ల మేర ధాన్యం సొమ్ము బకాయిలు కృష్ణారెడ్డి చెల్లించకపోవటంపై బాధిత రైతులు పోలీసులను ఆశ్రయించారు.

డబ్బులు అడుగుతుంటే రైతులపై కేసులు పెడతామని కృష్ణారెడ్డి అతని కుమారులు బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పొత్తంశెట్టి కృష్ణారెడ్డి అతని కుమారులపై అనపర్తి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత రైతులకు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు.

Updated Date - Dec 23 , 2023 | 06:34 PM