AP Politics : చంద్రబాబు గురించి మాట్లాడుతూ లోకేష్ ఎమోషనల్..
ABN, First Publish Date - 2023-10-21T12:43:14+05:30
టీడీపీ రాష్ట్ర విస్తృస్థాయి సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కన్నీళ్లు పెట్టుకున్నారు. సమావేశంలో గద్గద స్వరంతో ప్రసంగించిన యువనేత.. తప్పు చేయకున్నా.. ప్రజల కోసం పోరాడిన టీడీపీ అధినేత చంద్రబాబు అంటూ లోకేష్ కంటతడి పెడ్డారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు.
అమరావతి: టీడీపీ రాష్ట్ర విస్తృస్థాయి సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Nara Lokes) కన్నీళ్లు పెట్టుకున్నారు. సమావేశంలో గద్గద స్వరంతో ప్రసంగించిన యువనేత.. తప్పు చేయకున్నా.. ప్రజల కోసం పోరాడిన టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) అంటూ లోకేష్ కంటతడి పెడ్డారు. ఏ తప్పు చేయకున్నా చంద్రబాబును జైల్లో పెట్టారన్నారు. తమ ఆస్తులన్నీ బహిర్గతం చేశామని.. డబ్బే సంపాదించాలని చంద్రబాబే భావిస్తే రాజకీయాలు అవసరం లేదని చెప్పుకొచ్చారు.
ఎంతో మందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించారని.. అలాంటి చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం చంద్రబాబు పని చేశారని.. ప్రజలంతా ఆలోచించాలన్నారు. ఇవాళ చంద్రబాబు కుటుంబానికి ఇబ్బంది వచ్చిందని.. రేపు ప్రతి ఒక్కరి కుటుంబానికి ఇదే పరిస్థితి రావొచ్చన్నారు. సైకో జగన్ ఆలోచనలు ఇదే విధంగా ఉంటాయని విమర్శించారు. టీడీపీ-జనసేన పోరాడకుంటే రాష్ట్రం ముక్కలు చేసి అమ్మేసేవారన్నారు. ప్రజల కోసం పోరాడినందుకే చంద్రబాబును జైల్లో పెట్టారని మండిపడ్డారు. టీడీపీ-జనసేన కలిస్తే 160 స్థానాలు ఖాయమని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు.
Updated Date - 2023-10-21T13:14:58+05:30 IST