ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu bail petition: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా.. ఉదయం నుంచి అసలేం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-10-04T17:37:46+05:30

ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్ట్ రేపటికి (గురువారం) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇరువురు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి మిగతా వాదనలను గురువారం 11.15 గంటలకు వింటానని చెప్పారు.

విజయవాడ: ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్‌లపై విచారణను విజయవాడ ఏసీబీ కోర్ట్ రేపటికి (గురువారం) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఇరువురు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి మిగతా వాదనలను గురువారం 11.15 గంటలకు వింటానని చెప్పారు. కాగా బుధవారం ఉదయం నుంచి చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై కోర్టులో హోరాహోరీ వాదనలు జరిగాయి.

ఏఏజీ పొన్నవోలు సుధాకర రెడ్డి వాదనలు ఇవే..

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లభించిన అన్ని ఆధారాలు కోర్టు ఎదుట ఉంచామని, చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన అన్ని వివరాలను పరిశీలిస్తే అర్థమవుతుందని పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. చంద్రబాబు గురించి చెప్పడానికి స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇదేమి ఫిక్షన్ స్టోరీ కాదని, కల్పిత పాత్ర కాదని వ్యాఖ్యానించారు. స్కామ్ జరిగిందని ఆధారాలు ఉన్నాయి కాబట్టే మరింత లోతుగా విచారించేందుకు కస్టడీకిఇవ్వాలని, బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నామని పేర్కొన్నారు.

‘‘ చంద్రబాబుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారు. బెయిల్ ఇవ్వొద్దు. చంద్రబాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలి. స్కిల్ కుంభకోణం దర్యాప్తు కీలక దశలో ఉంది. దర్యాప్తుకు కీలకంగా ఉన్న దశలో చంద్రబాబుకి బెయిల్ ఇవ్వడం సరికాదు. చంద్రబాబుకి బెయిల్ ఇస్తే సాక్షులని ప్రభావితం చేస్తారు. ఇప్పటికే చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్, మనోజ్ పార్ధసాని విదేశాలకు పారిపోవడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది. స్కిల్ కుంభకోణంలో రూ.270 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైంది. డొల్ల కంపెనీల పేరుతో నిధులు దారి మళ్లించారు. 21-07-2017లోనే రూ.371 కోట్ల నిధులకు పన్నుల ఎగవేతపై జీఎస్టీ ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. 05-01-2018న ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించడంతోపాటు సీబీఐని విచారించాలని జీఎస్టీ కోరింది. ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్ధల విచారణలో ఉండగానే 26-07-2018న 17ఏ సవరణ జరిగింది. ఈ కేసులో చంద్రబాబుకి 17ఏ వర్తించదు’’ అని వాదించారు.


చంద్రబాబు తరుపు వాదనలు ఇవే..

చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వివిపించారు. ‘‘ స్కిల్ కేసులో చంద్రబాబు వైపు ఎలాంటి తప్పిదాలు లేవు. అప్పటి ఆర్థిక శాఖ ఉన్నతాధికారి కే.సునీత గుజరాత్ వెళ్లి అధ్యయనం చేశారు. సునీత అధ్యయనం చేసి ఎలాంటి అభ్యంతరం సీమెన్స్ ప్రాజెక్టుకు తెలపలేదు. సీమెన్స్ ప్రాజెక్టుకు ఎలాంటి అభ్యంతరం లేకుండా కేబినెట్ ఆమోదం పొందిందన్న విషయమై ఆధారాలు ఉన్నాయి. కాస్ట్ ఎవాల్యూయేషన్ కమిటీ స్కిల్ ప్రాజెక్టు ఎక్విప్‌మెంట్ ధరను నిర్ధారించింది. ఆ కమిటీలో చంద్రబాబు లేరు. ఆ కమిటీలో ఉన్న భాస్కరరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. సుప్రీంకోర్టు నవంబర్ 16 వరకు మధ్యంతర బెయిలును పొడిగించింది. చంద్రబాబుకు ఎలాంటి నోటీసివ్వకుండా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత విచారణ చేపట్టారు. ఆ తర్వాత రెండు రోజుల కస్టడీలోనూ విచారణ చేపట్టారు. ఇప్పుడు మళ్లీ కస్టడీ కావాలంటున్నారు.‍. అవసరం ఏముంది?. కేబినెట్ ఆమోదం పొందిన తర్వాతే సీమెన్స్ ప్రాజెక్టు అమల్లోకి వచ్చింది. కెబినెట్ నిర్ణయంపై చంద్రబాబు మీద కేసు ఎలా పెడతారు?’’ అని వాదించారు.


చెప్పిందే చెబుతుంటే ఎన్నిసార్లు వింటాం: జడ్జి

ఏసీబీ కోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలపై ఒకానొక దశలో న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. చెప్పిన అంశాలను పదేపదే ఎందుకు చెబుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ‘‘ నేరానికి సంబంధించిన ఆధారాలు ఉంటే చూపించండి. రిమాండ్ రిపోర్ట్, కస్టడీ పిటిషన్‌ల సమయంలో చెప్పిన వాదనలే మళ్లీ చెబుతున్నారు. ఈడీ దర్యాప్తు చేసిందని, ఇన్‌కమ్ ట్యాక్స్ నోటీసు ఇచ్చిందని గతంలో చాలాసార్లు చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిధుల దుర్వినియోగానికి సంబంధించిన ఆధారాలు ఉంటే ఇవ్వండి. చెప్పిందే చెబుతుంటే ఎన్నిసార్లు వింటాం’’ అని సీఐడీ తరపున వాదనలు వినిపిస్తున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డిపై జడ్జి అసహనం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు జడ్జి సూటి ప్రశ్న...

వాదనలు వింటున్న సమయంలో కలగజేసుకుని జడ్జి... కేబినెట్ నిర్ణయాన్ని చంద్రబాబుకు ఎలా ఆపాదిస్తారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని ప్రశ్నించారు. కేబినెట్ నిర్ణయం ప్రకారం జీవో ఇచ్చారు.. కానీ జీవోకు వ్యతిరేకంగా ఒప్పందం జరిగిందని పొన్నవోలు బదులిచ్చారు. సోషియో ఎకనామిక్ ఆఫెన్సుల్లో బెయిల్ ఇవ్వొద్దని సుప్రీం తీర్పులున్నాయంటూ ఉదహరించారు. స్కిల్ కేసులో ప్రతి అంశం, ప్రతి తప్పిదం చంద్రబాబు సూచనల మేరకే జరిగిందని పొన్నవోలు వాదించారు.

Updated Date - 2023-10-04T17:38:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising