Purandeswari: వైసీపీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తోంది
ABN, First Publish Date - 2023-09-23T17:02:37+05:30
దేశంలో మోదీ మహిళలు కోసం తపన పడుతుంటే రాష్ట్రంలో జగన్ మద్యం కోసం తపన పడుతున్నారు. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. నిబంధనలు పాటించకుండా ప్రజలకు చీఫ్ లిక్కర్ ఇస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మద్యంపై శవాలపై పేలాలు వేరుకునే విధంగా
విశాఖ: ప్రజా వేదిక కూల్చివేత నుంచి వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ప్రారంభం అయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన (PM modi) వేడుకలో భాగంగా బీజేపీ కార్యాలయంలో రక్తదాన శిబిరం పురందేశ్వరి నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడారు. ‘‘ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నిస్తే వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. సీఎం జగన్ (cm jagan) రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టుకు కేంద్రంకు సంబంధం ఏంటి. చంద్రబాబు (Chandrababu) కేసును సీఐడీ విచారణ చేస్తుంది. సీఐడీ (CID) రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న సంస్థ. చంద్రబాబు అరెస్టును కేంద్రంతో ముడి పెట్టడం సరికాదు. బీజేపీతో పొత్తులో ఉన్నామని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీడీపీ-బీజేపీతో కలిసి వెళ్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ (Pawan kalyan) చెప్పారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి బీజేపీ అధిష్టానాన్ని పొత్తులపై ఒప్పిస్తా అన్నారు. మాది జాతీయ పార్టీ పొత్తులు అంశం కేంద్ర పెద్దలు చేతిలో ఉంటుంది. పొత్తులపై వారే నిర్ణయం తీసుకుంటారు.’’ అని పేర్కొన్నారు.
‘‘దేశంలో మోదీ మహిళలు కోసం తపన పడుతుంటే రాష్ట్రంలో జగన్ మద్యం కోసం తపన పడుతున్నారు. మద్యంపై రాష్ట్ర ప్రభుత్వం దోపిడీ చేస్తుంది. నిబంధనలు పాటించకుండా ప్రజలకు చీఫ్ లిక్కర్ ఇస్తూ వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. మద్యంపై శవాలపై పేలాలు వేరుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. నాణ్యతలేని మద్యం సేవించడం వల్ల అనేకమంది రోగాల బారిన పడుతున్నారు. రాష్ట్రంలో మద్యం వలన వస్తున్న ఇబ్బందులపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశాను. రాష్ట్రంలో మద్యంపై జరుగుతున్న దోపిడీపై సీబీఐతో విచారణ జరిపించాలి. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీని ఆటకెక్కించేశారు. ఆస్పత్రులకు బిల్లులు మంజూరు చేయక పోవడంతో రోగులకు వైద్యం అందించడం లేదు. ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వతేది వరకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.’’ అని తెలిపారు.
Updated Date - 2023-09-23T17:02:37+05:30 IST