ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gantasrinivas: సీఎం జగన్‌పై గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-10-03T13:37:56+05:30

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దసరా తర్వాత జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారట... దసరాకి జగన్ విశాఖకు రావడం.. శుభ వార్త కాదు, దుర్వార్త అంటూ విరుచుకుపడ్డారు.

విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు (Former Minister Ganta Srinivasrao) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం దసరా తర్వాత జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారట... దసరాకి జగన్ విశాఖకు రావడం.. శుభ వార్త కాదు, దుర్వార్త అంటూ విరుచుకుపడ్డారు. విశాఖలో ఎటువంటి అరాచక పరిస్థితులు ఉన్నాయో స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారన్నారు. ప్రశాంత విశాఖకు జగన్ వస్తున్నరంటే.. ప్రజల గుండెలు గుభేల్ మంటున్నాయన్నారు. కడప ఫ్యాక్షనిజం విశాఖ వస్తుందని భయపడుతున్నారని తెలిపారు. విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయం పెట్టి ఎవరిని మోసం చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. విశాఖకు జగన్ రావడం ప్రజల ఎవరికీ ఇష్టం లేదని.. కావాలంటే అభిప్రాయాలు సేకరించాలన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో సంబంధంలేని చంద్రబాబు.. అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. బండారు సత్యనారాయణ (Former Minister Bandaru Satyanarayana) సీనియర్ సిటిజన్ అని చూడకుండా నిర్ధాక్షణ్యంగా వ్యవహరిస్తారా అని నిలదీశారు. అంతిమంగా న్యాయం, ధర్మం గెలుస్తాయనే విశ్వాసంతో చంద్రబాబు ఉన్నారన్నారు. ఆపత్కాలంలో జనసేన తమకు మద్దతుగా నిలవడం గొప్ప విషయమని.. రెండు పార్టీలు కలిసి రేపు ఎన్నికల్లో గెలవడం ఖాయమని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-03T13:37:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising