ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Global Investors Summit: విశాఖలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ప్రారంభం... ముఖేష్ అంబానీ హాజరు

ABN, First Publish Date - 2023-03-03T10:45:18+05:30

విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఘనంగా ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విశాఖపట్నం: విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (Global Investors Summit) ఘనంగా ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy), పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ (Mukesh Ambani), కరణ్ అదాని (Karan Adani), జీఎంఆర్ (GMR) సభావేదికపైకి చేరుకున్నారు. సీఎం జగన్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఇన్వెస్టర్ల సమ్మిట్‌కు ఏపీ ప్రభుత్వం (AP Government) భారీగా ఏర్పాట్లు చేసింది. రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి 10వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సదస్సు కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ (AU Engineering College) ఆవరణలో ఏర్పాట్లు జరిగాయి. సదస్సుకు పలు దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరుకానున్నారు. సమ్మిట్‌ను ఉద్దేశించి 21 మంది పారిశ్రామిక వేత్తలు (Industrialists) మాట్లాడనున్నారు.

కాగా... ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలోని 50 ఎకరాల్లో కేవలం వాహనాల పార్కింగ్‌కే 25 ఎకరాలు కేటాయించారు. మిగిలిన 25 ఎకరాల్లో ఐదు జర్మన్‌ హ్యాంగర్లు వేశారు. 4 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఓ పెద్ద హాలు, 50మంది ఆశీనులు కావడానికి వేదికను సిద్ధం చేశారు. నాలుగు వేల మందికి భోజనాల కోసం మరో హాలు, సీఎం కోసం ప్రత్యేకంగా ఒక లాంజ్‌, చర్చలు, సమావేశాలకు మరో రెండు హాళ్లు కేటాయించారు. అతిథుల కోసం నగరంలోని స్టార్‌ హోటళ్లలో 750కు పైగా సూట్‌లు, రూమ్‌లు బుక్‌ చేశారు. ఇవికాకుండా మరో వెయ్యి గదులు తీసుకున్నారు. విదేశీ అతిథుల వ్యక్తిగత అవసరాల కోసం కార్వాన్లు కూడా రప్పించారు. అన్ని దేశాల వారికి ఇష్టమైన ఆహార పదార్థాలు అందించేందుకు పేరొందిన హోటళ్ల చెఫ్‌లతో వంటకాలు చేయిస్తున్నారు. వీరందరికీ 3న సాయంత్రం ఆర్‌కే బీచ్‌లోని ఎంజీఎం పార్కులో డిన్నర్‌ ఏర్పాటు చేశారు. కాగా, ఇన్వెస్టర్ల సదస్సుతో పాటు నెలాఖరులో జి-20 సదస్సు కూడా నగరంలో నిర్వహించనున్న నేపథ్యంలో అతిథులను ఆకట్టుకునేలా రూ.100కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు.

Updated Date - 2023-03-03T10:52:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!