Visakha Steel Plant.. ఈవోఐలో పాల్గోని బిడ్ దాఖలు చేసిన జేడి లక్ష్మినారాయణ

ABN , First Publish Date - 2023-04-15T16:27:42+05:30 IST

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ఈవోఐ (EOI)లో సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) పాల్గోని బిడ్ (Bid) దాఖలు చేశారు.

Visakha Steel Plant.. ఈవోఐలో పాల్గోని బిడ్ దాఖలు చేసిన జేడి లక్ష్మినారాయణ

విశాఖపట్నం: విశాఖ స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ఈవోఐ (EOI)లో సీబీఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ (JD Lakshminarayana) పాల్గోని బిడ్ (Bid) దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందులో ఏం చేయలగమో అనేది ఆలోచిస్తామన్నారు. స్టీల్ ప్లాంట్‌ను బిడ్డలా చూసుకోవాలనే బిడ్ వేశామన్నారు. ప్రభుత్వం క్లీన్ సేవ్ (Clean save) చేయాలనకుంటోందని.. మేము క్లియర్ సేవ్ (Clear save) చేయాలని ఆలోచిస్తున్నామన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వరంగ సంస్థగా ఉండాలనేది తామందరి కోరిక అని జేడి లక్ష్మినారాయణ పేర్కొన్నారు.

అంతకుమందు శనివారం ఉదయం జెడి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల తరఫున ఈవోఐ బిడ్డింగ్‌ (Bidding)లో తాను పాల్గొంటున్నానని.. మన స్టీల్ ప్లాంట్‌ (Steel Plant)ను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపిచ్చారు. ఒక్కొక్కరు 400 రూపాయలు స్టీల్ ప్లాంట్ కోసం వెచ్చిస్తే... మన స్టీల్ ప్లాంట్‌ను మనమే కాపాడుకుంటామని అన్నారు. చరిత్రలోనే నిలిచిపోయే నిర్ణయంగా మారుతుందన్నారు. ఫగ్గన్ సింగ్ (Faggan Singh) ఉక్కు సహాయ మంత్రి కాదని.. ఆసహాయ మంత్రి అని ఎద్దేవా చేశారు. ఒక మాట చెప్తే దానికి కట్టుబడి ఉండాలన్నారు. పూటకో మాట మార్చడం సరైన పద్ధతి కాదని జేడి లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు.

కాగా విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగలేదని, ముందుకే సాగుతోందని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. గురువారం విశాఖలో పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే.. ప్రైవేటీకరణపై పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పరిశ్రమను విక్రయించే ఆలోచన లేదని ఉదయం ప్రకటించిన ఆయన.. సాయంత్రానికి మాట మార్చేసి పరిశ్రమను విక్రయించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని, ఇప్పటికే సంస్థ లిస్టింగ్‌లో ఉందని వ్యాఖ్యానించడంతో పరిశ్రమ కార్మికులు, ఉద్యోగుల్లో అయోమయం నెలకొంది. ఈ నేపథ్యంలో ఉక్కు శాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియ నిలిచిపోయిందని కొన్ని మీడియాలో వచ్చిన కథనాలను ఖండించింది. ‘విశాఖ ఉక్కు పరిశ్రమకు సంబంధించి పెట్టబడుల ఉపసంహరణ ప్రక్రియ నిలిచిపోలేదు. నిలిచిపోయిందని కొన్ని మీడియా కథనాలు వచ్చిన నేపథ్యంలో దీనిపై స్పష్టత ఇస్తున్నాం. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ సాగుతోంది. పరిశ్రమ పనితీరు మెరుగుపరచడానికి సంస్థ కృషి చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వమూ మద్దతిస్తోంది’ అని పేర్కొంది. దరిమిలా ఇక పరిశ్రమ ప్రైవేటీకరణ ఆగదని తేటతెల్లమైంది. దీనిపై ఉక్కు కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి.

Updated Date - 2023-04-15T16:27:42+05:30 IST