KA Paul: విశాఖ ఎంపీగా గెలిపించకపోతే ప్రజలే నష్టపోతారు
ABN, First Publish Date - 2023-11-16T14:21:22+05:30
నేను విశాఖ ఎంపీగా ఎన్నికైతే అనేక ప్రయోజనాలు ఉంటాయని అన్ని పార్టీలు భావించడం సంతోషం. విశాఖ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ ఎంపీగా పోటీ చేయట్లేదని..
విశాఖ: పార్లమెంట్‌లో ప్రధాని మోదీని (Pm modi) ఎదుర్కొనే సత్తా తనకు తప్ప ఎవ్వరికీ లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ. పాల్ (KA Paul) వ్యాఖ్యానించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నేను విశాఖ ఎంపీగా ఎన్నికైతే అనేక ప్రయోజనాలు ఉంటాయని అన్ని పార్టీలు భావించడం సంతోషం. విశాఖ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ ఎంపీగా పోటీ చేయట్లేదని.. నాకు సపోర్ట్ చేయడం సంతోషం. ఇక టీడీపీ అభ్యర్థి భరత్ కూడా కేఏ.పాల్ విశాఖ ఎంపీ అయితే బాగుంటుందని తన అనుచరులకు చెబుతున్నారు. అలాగే జేడీ లక్ష్మీ నారాయణ నన్ను విశాఖ అభ్యర్థిగా గెలిపించడానికి తన కోసం ప్రచారం చేస్తానని హామీ ఇచ్చారు. బీజేపీ అభ్యర్థిగా ఊహించుకుంటున్న జీవీఎల్ అసలు పోటీ చేస్తారో? లేదో? ఆయనకే తెలీదు. బీజేపీ స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ ఏ హామీ నెరవేర్చని బీజేపీకి ఎవరు ఓట్లేస్తారు?, విశాఖ వాసులు సహృదయంతో అర్థం చేసుకుని పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించండి. తనను, ప్రజా శాంతి పార్టీనీ గెలిపించక పోతే ప్రజలకే నష్టం.’’ అని కేఏ.పాల్ చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-11-16T14:21:24+05:30 IST