Supreme Court: రుషికొండపై రేపు సుప్రీంకోర్టులో విచారణ
ABN, First Publish Date - 2023-11-02T20:50:55+05:30
రుషికొండ ( Rushikonda ) పై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ( Supreme Court ) లో రిట్ దాఖలు అయింది.
ఢిల్లీ: రుషికొండ ( Rushikonda ) పై అక్రమ నిర్మాణాలు, జగన్ క్యాంపు ఆఫీస్ ఏర్పాటుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ( Supreme Court ) లో రిట్ దాఖలు అయింది. ప్రధాన న్యాయమూర్తి dy చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు రేపు విచారణ చేపట్టనున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో లింగమనేని శివరామ ప్రసాద్ పిల్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/A ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని పిటేషన్‌లో విజ్ఞప్తి చేశారు. NGT, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ విషయంపై ఉన్న కేసులు పరిష్కారం అయ్యేవరకు రుషి కొండపై ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని లింగమనేని శివరామ ప్రసాద్ సుప్రీంకోర్టుకు పిటీషన్‌లో పేర్కొన్నారు.
Updated Date - 2023-11-02T20:50:57+05:30 IST