ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sitaram Yechury: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను ఖండించిన సీతారాం ఏచూరి

ABN, First Publish Date - 2023-10-05T22:21:18+05:30

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) ఖండించారు.

విశాఖపట్నం: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) అక్రమ అరెస్ట్‌ను సీపీఎం పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(Sitaram Yechury) ఖండించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ విశాఖపట్నంలోని కూర్మన్నపాలెం ఆర్చ్ వద్ద సీపీఎం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో సీతారాం ఏచూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా సీతారాం ఏచూరి మాట్లాడుతూ..‘‘ఈ కేసు కోర్టులో ఉంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) వైఖరిలో స్పష్టత లేదు. బీజేపీ, టీడీపీలతో కలవాలని పవన్‌ అంటున్నారు. ఒకసారి ఎన్డీఏ(NDA)కు దూరం అంటారు. మరోసారి మోదీతో మాట్లాడాలి అంటారు. ఏపీలో 175 స్థానాలకు 175 గెలుస్తామని ఎవరైనా అంటే.. అది ఎన్నికల వ్యూహంలో భాగమే. మత సామరస్యం, రాజ్యాంగ స్ఫూర్తి పరిరక్షించాలంటే.. INDIA కూటమి అధికారంలోకి రావాలి. దేశం అభివృద్ధి చెందాలంటే మోదీని అధికారానికి దూరం చేయాలి. భారత రాజ్యాంగాన్ని కాపాడాలంటే.. మోదీ సర్కారును ఓడించాలి’’ అని సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు.

Updated Date - 2023-10-05T22:22:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising