అన్న క్యాంటీన్ సేవలు చారిత్రాత్మకం
ABN , First Publish Date - 2023-05-24T01:21:10+05:30 IST
పేదవాడికి ఐదు రూపాయలకే పట్టెడన్నం పెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ సేవలు చారిత్రాత్మకమని మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు.

ఎలమంచిలి, మే 23: పేదవాడికి ఐదు రూపాయలకే పట్టెడన్నం పెట్టేందుకు ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ సేవలు చారిత్రాత్మకమని మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు అన్నారు. పట్టణంలోని టీడీపీ ప్రాంతీయ కార్యాలయం వంద రోజులకు పైబడి నిర్వహిస్తున్న క్యాంటీన్‌ను మంగళవారం పప్పల చలపతిరావు, ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు పరిశీలించి, భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో నాయకులు దూళి రంగనాయకులు, గొర్లె నానాజీ, రమణబాబు, నేతలు కొలుకులూరి విజయ్‌బాబు, ఆదిమూర్తి పాల్గొన్నారు.