రామభద్రరాజుకు అయ్యన్న నివాళి
ABN , First Publish Date - 2023-06-11T00:14:45+05:30 IST
అనారోగ్యంతో మృతిచెందిన ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ రాజాసాగి రామభద్రరాజు కుటుంబ సభ్యులను టీడీపీ పొలిటీబ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు పరామర్శించారు.

కోటవురట్ల, జూన్ 10: అనారోగ్యంతో మృతిచెందిన ఏటికొప్పాక సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ రాజాసాగి రామభద్రరాజు కుటుంబ సభ్యులను టీడీపీ పొలిటీబ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు పరామర్శించారు. శనివారం మండలంలోని తంగేడు గ్రామానికి వెళ్లి రామభద్రరాజు కుమారుడిని, కుటుంబసభ్యులతో అయ్యన్న మాట్లాడారు. అనంతరం రామభద్రరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ రామచంద్రరాజు (చంటిబాబు) తదితరులు పాల్గొన్నారు.