ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atchannaidu: ప్రజల దృష్టి మరల్చేందుకే ‘గీతం’పై రాద్ధాంతం

ABN, First Publish Date - 2023-01-06T12:50:40+05:30

అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే ఈరోజు గీతం యూనివర్శిటీ (GITAM University)పై పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ

YCPని బంగాళాఖాతంలో పడేయడం తథ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: అరాచక పాలన నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసమే ఈరోజు గీతం యూనివర్శిటీ (GITAM University)పై పడ్డారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ధ్వజమెత్తారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం (Ycp Government)పై ఫైరయ్యారు. ‘‘కక్షలు కార్పణ్యాలు తప్ప.. జగన్ రెడ్డి (Cm jagan) పాలనలో సాధించిందేంటి? రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే ‘‘గీతం వర్సిటీ’’పై రాద్ధాంతం. గత మూడున్నర సంవత్సరాలుగా విశాఖలోని ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తుల్ని చెప్పు చేతల్లో పెట్టుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ప్రఖ్యాత గీతం విద్యా సంస్థలపై ఆరోపణలు చేస్తూ ఆస్తి ధ్వంసాలకు పాల్పడుతున్నారు. గతంలో గీతం యూనివర్శిటీ ప్రభుత్వ భూములు ఆక్రమించిందని చెప్పి ఏమీ తేల్చలేదు. ఇప్పుడు మరోసారి ఆక్రమణల ఆరోపణలతో గీతం వర్శిటీ భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జగన్ రెడ్డి పతనం ప్రారంభమైంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, తెలుగుదేశం పార్టీ (tdp)కి ప్రజల్లో మద్దతు పెరగడంతో జగన్ రెడ్డి ఫ్రెస్టేషన్ పీక్స్‌కు చేరింది. వచ్చే ఎన్నికల్లో ప్రజలు చీపుర్లతో తరిమి కొట్టడం తథ్యం అని తేలిపోయింది. ఏం చేయాలో తెలియని దుస్థితిలో తెలుగుదేశం పార్టీ నేతలపై, వారి సంస్థలపై దాడులకు తెరలేపారు. విశాఖ (Visakhapatnam)లో వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని కబ్జా చేసిన జగన్ రెడ్డి.. ఇప్పుడు ప్రత్యర్ధుల భూముల్ని కూడా స్వాహా చేసేందుకు ఏకంగా అధికారుల్ని వాడుకుంటున్నాడు. గీతం యూనివర్శిటీపై చేసే ఆరోపణలు ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా చేసినవే. నిజంగా ఆక్రమణలు ఉంటే నోటీసులిచ్చి తర్వాత చర్యలకు దిగాలి. నోటీసులు కూడా ఇవ్వకుండా సర్వేలు చేయడం, కంచెలు వేయడం రాజకీయ కక్ష సాధింపులే. రాజధాని పేరుతో ప్రశాంత విశాఖను ఫ్యాక్షన్ కేంద్రంగా మార్చారు. భూ కబ్జాలు, ఆక్రమణలు, సెటిల్ మెంట్లకు కేంద్రంగా తయారు చేశారు. జీవో నెం.1 పేరుతో ప్రజాస్వామ్య స్ఫూర్తికి జగన్ రెడ్డి తూట్లు పొడుస్తూ చేస్తున్న అప్రజాస్వామిక, నియంతృత్వ పాలనపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. జీవో పేరుతో చంద్రబాబు (Chandrababu) సభలను అడ్డుకోవడం, వైసీపీ నేతల సభలు, ర్యాలీలకు రెడ్ కార్పెట్ వేయడంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత మొదలైంది. జగన్ రెడ్డీ.. వచ్చే ఎన్నికల్లో నిన్ను, నీ పార్టీని కట్టకట్టి బంగాళాఖాతంలో పడేయడం తథ్యం.’’ అని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.

Updated Date - 2023-01-06T12:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising