ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anitha: లిక్కర్ మీద సీఎం జగన్ లక్ష కోట్లు సంపాదించారు

ABN, First Publish Date - 2023-11-02T16:30:12+05:30

చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ రావడం అందరికీ సంతోషంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలూ చంద్రబాబుకు నీరాజనం పట్టారు. రాజమండ్రి నుంచి ఇంటికి చేరడానికి 14 గంటల సమయం పట్టింది. బెయిల్ వచ్చే ముందు రోజు కూడా అక్రమ కేసులు

విశాఖ: లిక్కర్ మీద సీఎం జగన్ (Cm jagan) లక్ష కోట్లు సంపాదించారని తెలుగు మహిళా అధ్యక్షరాలు అనిత (Vangalapudi anitha) విమర్శించారు. అనిత మీడియాతో మాట్లాడారు. ‘‘దమ్ముంటే మద్యం స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలి. కావల్సిన మద్యం బ్రాండ్స్ ఏపీలో ఉండవు. ఏపీలో ఉన్న బ్రాండ్స్ ప్రపంచంలో ఉండవు. ఎన్నికల ముందు మద్యపాన నిషేధం అన్నారు.. ఆ తర్వాత దశల వారీగా మద్యపాన నిషేధం అన్నారు... ఈ మాట కూడా తప్పారు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతామని జగన్ అన్నారు.. ఆ మాట మీద ఉంటారా?, మద్యం మీద పురంధేశ్వరి మాట్లాడితే విజయ సాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.’’ అని తప్పుపట్టారు.

‘‘చంద్రబాబుకి మధ్యంతర బెయిల్ రావడం అందరికీ సంతోషంగా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలూ చంద్రబాబుకు నీరాజనం పట్టారు. రాజమండ్రి నుంచి ఇంటికి చేరడానికి 14 గంటల సమయం పట్టింది. బెయిల్ వచ్చే ముందు రోజు కూడా అక్రమ కేసులు పెట్టారు. మద్యంలో అవినీతి చేసి జగన్ లక్ష కోట్లు సంపాదించారు. ఇపుడు చంద్రబాబు, కొల్లు రవీంద్రపై కేసులు పెడతారా?, ఒకవేళ కేసు పెడితే అప్పటి ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం రెడ్డిపై పెట్టాలి. డబ్బు మదం ఉన్న వాళ్లే మద్యం తాగుతారన్న మంత్రి బొత్స వ్యాఖ్యలు తప్పు బడుతున్నాం. ఎంతో రాజకీయ అనుభవం ఉన్న బొత్స... వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయన సీనియారిటీ తగ్గింది’’ అని అనిత వ్యాఖ్యానించారు.

Updated Date - 2023-11-02T16:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising