Kottu Satyanarayana: రాజకీయ పార్టీలు అలా భావిస్తున్నాయి
ABN, First Publish Date - 2023-07-07T17:27:54+05:30
ముఖ్యమంత్రి జగన్ తలపెట్టిన ప్రతి కార్యక్రమం వెనుక భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. భగవంతుడు 2014 నుంచి రావాల్సిన నిధుల వరద పారిస్తున్నాడు. ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రజల కోసం ప్రధానమంత్రికి చేసిన విజ్ఞాపనలు విని సహృదయంతో నిధులు ఇస్తున్నారు.’’ అని తెలిపారు.
తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి: ఏపీలో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు హడావుడి పడిపోతున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ వ్యాఖ్యానించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి జగన్ తలపెట్టిన ప్రతి కార్యక్రమం వెనుక భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి. భగవంతుడు 2014 నుంచి రావాల్సిన నిధుల వరద పారిస్తున్నాడు. ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రజల కోసం ప్రధానమంత్రికి చేసిన విజ్ఞాపనలు విని సహృదయంతో నిధులు ఇస్తున్నారు.’’ అని తెలిపారు.
‘‘అమ్మవారి పేరుతో ఉన్న వాహనం ఎక్కి అసత్యాలు పలుకుతూ చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగానూ ఫలించవు. అధర్మాన్ని ఆశ్రయించి మాట్లాడే మాటలు ఏ రకంగా అమ్మవారు సహిస్తుంది..? ఈ విషయం పవన్ ఎప్పటికి తెలుసుకుంటారు. వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబును ఆశ్రయించిన అతని విధానాన్ని తప్పుపడుతున్నాం. ఒక సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని.. ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేసేలాగా మాట్లాడే ప్రతి మాట ఖండిస్తున్నాం. నువ్వు స్థాపించిన పార్టీ సిద్ధాంతపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చెయ్యి. వారాహి దేవి అనుగ్రహం కలగాలంటే నువ్వు ధర్మం పక్షం వహించు.’’ అంటూ పవన్‌కల్యాణ్‌కు మంత్రి సూచించారు.
Updated Date - 2023-07-07T17:27:54+05:30 IST