TATA Motors: టాటా మోటార్స్ గుడ్‌న్యూస్.. ఇకపై..
ABN, First Publish Date - 2023-01-18T16:20:54+05:30
దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ (TATA Motors) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆధరణ పొందుతున్న ఎలక్ట్రిక్ సిరీస్‌లోని నెగ్జాన్ ఈవీ ప్రైమ్ (Nexon EV Prime), నెగ్జాన్ ఈవీ మ్యాక్స్ (Nexon EV Max) కార్ల ధరలను రూ.50 వేల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
ముంబై: దేశీయ వాహన దిగ్గజం టాటా మోటార్స్ (TATA Motors) గుడ్‌న్యూస్ చెప్పింది. ఆధరణ పొందుతున్న ఎలక్ట్రిక్ సిరీస్‌లోని నెగ్జాన్ ఈవీ ప్రైమ్ (Nexon EV Prime), నెగ్జాన్ ఈవీ మ్యాక్స్ (Nexon EV Max) కార్ల ధరలను రూ.50 వేల వరకు తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. వేరియంట్ల ఆధారంగా ఈ ధర తగ్గింపు ఉంటుందని స్పష్టం చేసింది. కాగా నెగ్జాన్ ఈవీ ప్రైమ్, నెగ్జాన్ ఈవీ మ్యాక్స్ కార్ల ధర ప్రస్తుతం రూ.14.49 లక్షల నుంచి రూ.16.99 లక్షల రేంజ్‌లో (ఎక్స్-షోరూం) ఉన్నాయి. ఈ ధరల సవరణతో నెగ్జాన్ ఈవీ ప్రైమ్ పరికరాల విషయంలో ఎలాంటి మార్పులు ఉండబోవని టాటా మోటార్స్ వెల్లడించింది.
నెగ్జాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌ఎమ్ ఆవిష్కరణ
భారతీయ మార్కెట్‌లో నెగ్జాన్ ఈవీలోని కొత్త వేరియెంట్ టాటా నెగ్జాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌ఎమ్‌ను టాటా మోటార్స్ ఆవిష్కరించింది. కారు ధర రూ.16.49 లక్షలుగా (ఎక్స్-షోరూం) ఉంది. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌తో 453 కిలోమీటర్లు ప్రయాణించగలదు. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్స్, ఆటో క్లైమాట్ కంట్రోల్, ఈఎస్‌పీ, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, కీలెస్‌గో, కనెక్టెడ్ వెహికిల్ టెక్, అన్నీ చక్రాలకు డిస్క్ బ్రేకులు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ కారు డెలివరీలు ఏప్రిల్ 2023 నుంచి మొదలవుతాయని కంపెనీ వెల్లడించింది. నెగ్జాన్ ఈవీ వేరియంట్ సిరీస్ కార్ల రేట్లను గణనీయంగా తగ్గించింది. నెగ్జాన్ ఈవీ మ్యాక్ ఎక్స్‌జెడ్+, ఎక్స్‌జెడ్+లక్స్ ధరలు రూ.85 వేల వరకు తగ్గనున్నట్టు కంపెనీ వెల్లడించింది. నెగ్జాన్ ఈవీ మ్యాక్స్ ధర రూ.85 వేల వరకు తగ్గే అవకాశాలున్నాయి. సరికొత్త నెగ్జాన్ మ్యాక్స్ ఎక్స్‌ఎం వంటి వేరియెంట్‌ను 3.3 కిలోవాట్స్ ఛార్జర్ లేదా అంతకంటే ఎక్కువైన 7.2 కిలోవాట్స్ ఛార్జర్‌తో ఎంచుకోవచ్చు. తద్వారా భారీగా రేటు తగ్గింపు పొందే అవకాశం ఉంది.
Updated Date - 2023-01-18T16:24:47+05:30 IST