IIT Madras: అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటీ మద్రాస్‌

ABN , First Publish Date - 2023-06-06T12:20:48+05:30 IST

దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థల జాబితాలో మద్రాస్‌ ఐఐటీ (IIT Madras) వరుసగా ఐదోసారి ప్రథమస్థానంలో నిలిచింది. ఐఐటీ-ఎం ఇంజ

IIT Madras: అత్యుత్తమ విద్యా సంస్థగా ఐఐటీ మద్రాస్‌

- కేంద్ర విద్యాశాఖ ప్రకటన

అడయార్‌(చెన్నై): దేశంలోని అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థల జాబితాలో మద్రాస్‌ ఐఐటీ (IIT Madras) వరుసగా ఐదోసారి ప్రథమస్థానంలో నిలిచింది. ఐఐటీ-ఎం ఇంజనీరింగ్‌ విభాగం మాత్రం వరుసగా ఎనిమిదో సారి మొదటి స్థానాన్ని దక్కించుకుంది. అలాగే, చెన్నై(Chennai)లోని అతి ప్రాచీన కాలేజీలీగా గుర్తింపు పొందిన రాజధాని కాలేజీ (ప్రెసిడెన్సీ కాలేజ్‌) మూడో స్థానంలో నిలిచింది. నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ కింద కేంద్ర విద్యాశాఖ ఈ ర్యాంకులను రూపొందించగా, ఈ జాబితాను తాజాగా ప్రకటించారు. విద్యా సంస్థల్లో అందిస్తున్న విద్యాబోధన, కల్పిస్తున్న సౌకర్యాల ఆధారంగా గత 2016 నుంచి ఈ ర్యాంకులను కేంద్ర విద్యాశాఖ విడుదల చేస్తూ వస్తోంది. అత్యుత్తమ ఉన్నత విద్యా సంస్థల జాబితో ఐఐటీ-ఎం(IIT-M) మొదటి స్థానంలో నిలువగా, ఈ విద్యా సంస్థలోని ఇంజనీరింగ్‌ విభాగం వరుసగా ఎనిమిదో యేడాది మొదటి స్థానాన్ని నిలబెట్టుకుంది. కాలేజీ విభాగంలో ఢిల్లీలోని మిరాండా హౌస్‌, హిందూ కాలేజీ, చెన్నైలోని ప్రిసెడెన్సీ కాలేజీలు తొలి మూడ స్థానాలను దక్కించుకున్నాయి.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-06-06T12:22:25+05:30 IST