Steve Smith-Gambhir: స్మిత్‌పై గంభీర్ బూతుల దండకం.. నిన్నటి మ్యాచ్‌లో ఎవరూ గమనించని సీన్
ABN , Publish Date - Mar 05 , 2025 | 02:06 PM
IND vs AUS: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ జోరుకు ఎదురులేకపోవడం, కప్పు వేటలో అడుగు ముంగిట నిలవడంతో గౌతీ ఆనందంగా ఉన్నాడు. రోహిత్ సేన ఇలాగే ఆడి ట్రోఫీ గెలిస్తే గంభీర్ కోచింగ్ కెరీర్‌లో తొలి గ్రాండ్ సక్సెస్ వచ్చినట్లే.

టీమిండియాను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాడు హెడ్ కోచ్ గౌతం గంభీర్. కోచ్‌గా ఎప్పటికప్పుడు పదునైన వ్యూహాలు పన్నుతున్నాడు. సీనియర్లు-జూనియర్ల మధ్య సమన్వయం ఉండేలా చూసుకుంటున్నాడు. యంగ్‌స్టర్స్‌కు వరుస అవకాశాలు కల్పిస్తూ వారి సక్సెస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. సారథి రోహిత్ శర్మకు విలువైన సూచనలు అందిస్తూ జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నాడు. కోచ్‌గా టెస్ట్ ఫార్మాట్‌లో ఇబ్బందిపడినా.. వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం గౌతీకి ఎదురుండటం లేదు. అందుకు తాజా చాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ ప్రదర్శనే ఉదాహరణగా చెప్పాలి. మెగా టోర్నీలో ఏకంగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది భారత్. నిన్న ఆస్ట్రేలియాను సెమీస్‌లో కంగుతినిపించింది. అయితే గెలుపు, ఆటగాళ్ల ప్రదర్శన అటుంచితే.. కోచ్ గంభీర్ వ్యవహార శైలి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఔట్ అవగానే..
నాకౌట్ మ్యాచ్‌లో గంభీర్ చాలా మటుకు ఒకే చోట కూర్చొని కూల్‌గా కనిపించాడు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం అతడు ఫుల్ సీరియస్‌గా దర్శనమిచ్చాడు. ముఖ్యంగా భారత బౌలింగ్ సమయంలో వికెట్లు పడినప్పుడు, రన్స్ లీకైన టైమ్‌లో గౌతీ సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. క్రీజులో పాతుకుపోయిన కంగారూ సారథి స్టీవ్ స్మిత్ (73) ఔటై వెళ్లిపోతున్నప్పుడు గంభీర్ గట్టి గట్టిగా అరిచాడు. కొన్ని బూతులు తిడుతూ అగ్రెసివ్‌గా కనిపించాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అస్సలు పట్టించుకోం
గంభీర్ తిట్ల దండకానికి సంబంధించిన వీడియోలు చూసిన నెటిజన్స్.. అతడిలో ఆ ఫైర్ ఇంకా అలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్లేయర్‌గా ఉన్నప్పుడు ఎంత అగ్రెసివ్‌గా ఉండేవాడో అదే తరహా యాటిట్యూడ్ ఇప్పుడు కూడా ఉందని అంటున్నారు. అయితే కోచింగ్ రెస్పాన్సిబిలిటీ ఉండటంతో కొంత కూల్‌గా ఉంటున్నాడని చెబుతున్నారు. గౌతీనా మజాకా.. అగ్రెషన్‌లో తగ్గేదేలే అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, సెమీస్ మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లోనూ భారత హెడ్ కోచ్ కాస్త సీరియస్‌గా రియాక్ట్ అయ్యాడు. టీమిండియా పెర్ఫార్మెన్స్, దుబాయ్ పిచ్ మనకు అనుకూలం, రోహిత్ రిటైర్మెంట్.. ఇలాంటి కొన్ని అంశాలపై స్పందిస్తూ.. చెప్పే వాళ్లు ఏదో ఒకటి చెబుతుంటారంటూ ఫైర్ అయ్యాడు. తాము ఎవరి మాటలు పట్టించుకోమని.. తమ పని తాము చేసుకుపోతామన్నాడు గంభీర్.
ఇవీ చదవండి:
ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం
కుల్దీప్‌పై రోహిత్-కోహ్లీ బూతుల వర్షం
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి