ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Police Recruitment Boardకు గర్భిణులు, బాలింతలు ఏం రిక్వెస్ట్ చేశారంటే..!

ABN, First Publish Date - 2023-02-17T12:55:00+05:30

ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన గర్భిణి అభ్యర్థులు, ఇటీవల ప్రసవం అయిన వారికి పోలీస్‌ నియామక బోర్డు నేరుగా మెయిన్స్‌ పరీక్ష రాసేందుకు

ఏం రిక్వెస్ట్ చేశారంటే..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మమ్మల్ని కూడా మెయిన్స్‌ రాయనివ్వండి

ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న గర్భిణులు, బాలింతల వినతి

హైదరాబాద్‌: ఎస్సై (SI), కానిస్టేబుల్‌ (Constable) ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న గర్భిణులు (pregnant women), బాలింతలు.. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (Police Recruitment Board) అనుసరిస్తున్న విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియామక ప్రక్రియలో బోర్డు ద్వంద్వ విధానాలను అవలబింస్తోందని అభ్యర్థులు మండిపడుతున్నారు. గత ఆగస్టులో తెలంగాణ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రాథమిక రాత పరీక్షలో తప్పుగా వచ్చిన 7 ప్రశ్నలకు కోర్టు (Court) ఆదేశాల మేరకు బోర్డు అధికారులు మార్కులు కలిపారు. దీంతో సుమారు 50 వేల మందికిపైగా అభ్యర్థులు ప్రిలిమ్స్‌ పాసయ్యారు. వారికి బుధవారం నుంచి ఈవెంట్స్‌ ప్రారంభమయ్యాయి. అయితే 7 మార్కులు కలపకముందు ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన గర్భిణి అభ్యర్థులు, ఇటీవల ప్రసవం అయిన వారికి పోలీస్‌ నియామక బోర్డు నేరుగా మెయిన్స్‌ పరీక్ష రాసేందుకు అనుమతించింది. మెయిన్స్‌లో అర్హత సాధిస్తే నిర్ణీత గడువులోగా ఈవెంట్స్‌కు హాజరవుతామని వారి నుంచి అంగీకార పత్రం తీసుకుంది. తాజాగా 7 మార్కులు కలపడంతో ప్రిలిమ్స్‌ పాసైన వారిలో కొంత మంది గర్భిణి అభ్యర్థులు, ఇటీవల ప్రసవం అయిన వారు కూడా ఉన్నారు. వారు నేరుగా మెయిన్స్‌ రాసేందుకు బోర్డు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయా అభ్యర్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తాము ఉన్న పరిస్థితుల్లో ఈవెంట్స్‌కు ఎలా హాజరవుతామని ప్రశ్నిస్తున్నారు. ఒకే నోటిఫికేషన్‌లో బోర్డు వేర్వేరు విధానాలు అనుసరించడం సరికాదంటున్నారు. తమకు కూడా మెయిన్స్‌ రాసే అవకాశం ఇవ్వాలని, ఆ తర్వాతే ఈవెంట్స్‌ నిర్వహించాలని కోరుతున్నారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో గర్భిణి అభ్యర్థులు, బాలింతలు గురువారం ఆందోళనలకు దిగారు. పలువురు చంటి పిల్లల తల్లులు తమ కుటుంబ సభ్యులతో డీజీపీ కార్యాలయాని (DGP office)కి చేరుకున్నారు. తమకు మినహాయింపు ఇవ్వాలని మెడికల్‌ సర్టిఫికెట్లతో బోర్డు అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

Updated Date - 2023-02-17T12:55:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising