Black Turmeric: నల్ల పసుపు గురించి విన్నారా? దీన్ని వాడితే ఎన్ని లాభాలంటే..!
ABN , Publish Date - Dec 21 , 2023 | 04:33 PM
సాధారణ పసుపు కంటే ఈ నల్ల పసుపు ఎన్ని రెట్లు మంచిదో తెలిస్తే షాకవుతారు.

అందరికీ పసుపు రంగులో ఉన్న పసుపు తెలుసు. వంటల నుండి అనేక ప్రయోజనాల కోసం పసుపును వాడతారు. పసుపు రంగులో ఉండటం వల్ల దీన్ని పసుపు అని అంటున్నారేమో తెలీదు కానీ పసుపు కేవలం పసుపు రంగులోనే కాదు.. నలుపు రంగులో కూడా ఉంటుంది. సాధారణ పసుపు కంటే ఈ నలుపు రంగు పసుపు ఎక్కువ ఆరోగ్య ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుందని అంటున్నారు. నల్ల పసుపు వాడితే కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..
నల్లపసుపు సాధారణ పసుపులాగా దుంపల రూపంలో ఉంటుంది. దీంట్లో కర్కుమిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కర్కుమిన్ గొప్ప యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. నల్ల పసుపు వంటలకు రుచినే కాదు, శరీరంలో నొప్పులు, వాపులు తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ సమస్యలకు కారణమయ్యే బ్యాక్టీరియాను అంతమొందిస్తుంది. వృద్దాప్యాన్ని మందగింపజేయడానికి, జీవక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి నల్ల పసుపు ఉపయోగపడుతుంది.
ఇది కూడా చదవండి: ఉదయాన్నే బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే.. గంపెడు లాభాలు!
నల్లపసుపులో కర్కుమిన్ క్యాన్సర్ కణాలతో పోరాడటం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఊపిరితిత్తులు, రొమ్ము, ప్రోస్టేట్, పెద్ద పేగు క్యాన్సర్ వంటి క్యాన్సర్ లలో ఇది ప్రభావవంతంగా ఉంటుంది.
నల్ల పసుపును వంటకాలలోనూ, పానీయాలలోనూ తీసుకోవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్, తేనె, నల్ల పసుపు మూడు కలిపి ఆరోగ్య కరమైన టానిక్ తయారుచేసుకుని వాడచ్చు. దీన్ని కొద్దిగా నీళ్లతో కలిపి తీసుకుంటే అద్బుత ప్రయోజనాలు ఉంటాయి. ఇది శరీరాన్ని శుద్ది చేస్తుంది. కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.
గాయాలు, చర్మ సంబంధ సమస్యలు, చికాకులు, క్రిమికీటకాల ఉపశమనానికి నల్ల పసుపును పేస్ట్ చేసి అప్లై చేస్తే తొందరగా తగ్గిపోతాయి. రోజువారి ఏవైనా మందులు, చికిత్స తీసుకుంటున్నట్టేతై వైద్యుల సలహా లేనిది దీన్ని వాడటం మంచిది కాదు. పసుపులో ఉండే కర్కుమిన్ మందులతో సంకర్షణ చెందుతుంది. దీనివల్ల వ్యతిరేక ఫలితాలు కూడా ఉండే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Spices: చలికాలంలో శరీర ఉష్ట్రోగ్రత నిలకడగా ఉండట్లేదా.. వంటింట్లో ఉండే వీటిని ట్రై చేస్తే..!
అతి సర్వత్రా వర్జయేత్ అనే మాట ప్రకారం నల్ల పసుపు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినా దీన్ని ఎక్కువగా వాడితే దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. దీన్ని ఎక్కువ వాడితే కడుపు నొప్పి, కడుపులో వికారం, మైకము, అతిసారం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చు. పిత్తాశయ సమస్యలు, రక్తస్రావ జబ్బులు, హార్మోన్ అసమతుల్యత, కాలేయ సమస్యలు ఉన్నవారు దీన్ని వాడటంలో వైద్యుల సలహా తీసుకోవాలి.
(గమనిక: ఇది ఆహార నిపుణులు, వైద్యులు పలుచోట్ల పేర్కొన్న అంశాల ఆధారంగా రూపొందించబడిన కథనం. ఆరోగ్యం గురించి ఏమైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.)
ఇది కూడా చదవండి: Year-Ender-2023: సంవత్సరాంతపు సెలవులలో మరింత మజా కావాలా? ఈ ఎవర్ గ్రీన్ ప్లేసుల వైపు ఓ కన్నేయండి..!
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.