Airport: విమానాశ్రయంలో అర్దరాత్రి సర్వర్ సమస్య.. 1,500 మంది ప్రయాణికుల పడిగాపులు
ABN, First Publish Date - 2023-10-04T12:56:05+05:30
చెన్నై విమానాశ్రయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. గత అర్ధ రాత్రి సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాలు ఆలస్యంగా నడిచాయి.
చెన్నై: చెన్నై విమానాశ్రయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. గత అర్ధ రాత్రి సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో విమానాలు ఆలస్యంగా నడిచాయి. ప్రింటింగ్ బోర్డింగ్ పాస్‌లు, బ్యాగేజ్ హ్యాండ్లింగ్‌లో అంతరాయం కారణంగా విదేశీ ప్రయాణాలు పూర్తిగా నిలిచిపోయాయి. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. సాంకేతిక సమస్య కారణంగా దుబాయ్, ప్యారిస్, బ్యాంకాక్, కొలంబోలకు తెల్లవారుజామున 1.30 గంటలకు వెళ్లాల్సిన విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 9 విమానాలు నిలిచిపోయాయి. దీంతో 1,500 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు పడాల్సి వచ్చింది. వారంతా 3 గంటలపాటు విమానాశ్రయంలోనే చిక్కుకుపోయారు. దీంతో నిద్ర లేకుండా రాత్రంతా విమానాశ్రయంలోనే వేచి చూస్తూ ఉండిపోయారు. సర్వర్ సమస్య 1,500 మంది ప్రయాణికులకు రాత్రంతా చుక్కలు చూపించింది. ఎట్టకేలకు తెల్లవారుజామున సర్వర్ రిపేర్ పూర్తయింది. దీంతో తెల్లవారుజామున 4.30 గంటలకు విమానాలు బయలుదేరాయి. ప్రస్తుతం చైన్నై విమానశ్రయంలో విమాన సేవలు సాధారణంగానే ఉన్నాయి.
Updated Date - 2023-10-04T12:56:05+05:30 IST