ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AAP: కాంగ్రెస్‌కు షాకిచ్చి ఆప్‌లో చేరిన 24 గంటల్లోనే..

ABN, First Publish Date - 2023-04-06T17:44:13+05:30

కాంగ్రెస్ ఆయన్ను వెలివేసింది. ఆ వెంటనే ఆయన అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు.

Sushil Rinku Jalandhar Lok Sabha bypoll AAP candidate
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమృత్‌సర్: నిన్నటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ కాంగ్రెస్ ఆయన్ను వెలివేసింది. ఆ వెంటనే ఆయన అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో చేరాడు. అది కూడా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌ (Punjab CM Bhagwant Mann) సమక్షంలో. క్షణం ఆలస్యం చేయని కేజ్రీ పంజాబ్‌‌ జలంధర్‌లో జరగబోయే లోక్‌సభ ఉప ఎన్నికకు అభ్యర్ధిగా ప్రకటించేశారు. ఇంతకీ ఆ అభ్యర్థి ఎవరంటే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుశీల్ రింకు(former Congress MLA Sushil Rinku). 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో జలంధర్ వెస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి షీతల్ అంగురల్ చేతిలో ఓటమి పాలయ్యారు. అనూహ్యంగా నిన్న కేజ్రీవాల్ సమక్షంలో ఆప్‌లో చేరడం ఆ వెంటనే జలంధర్ లోక్‌సభ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికకు రింకూను అభ్యర్థిగా ప్రకటించారు. రింకూ రాకతో పార్టీ మరింత బలోపేతమౌతుందని ఆప్ నేతలు అభిప్రాయపడుతున్నారు.

జలంధర్ లోక్‌సభ నియోజకవర్గంలో మే నెల 10న ఉప ఎన్నికలు జరగనున్నాయి. మే 13న ఫలితాలు వెలువడతాయి.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలో పాదయాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌధరి గుండెపోటుతో మరణించారు. దీంతో ఈ ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది.

నిన్న పంజాబ్‌లో పర్యటించిన పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌పై (Punjab CM Bhagwant Mann) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రశంసలు కురిపించారు. శ్రీరామనవమి పండుగను(Ram Navami) ప్రశాంతంగా నిర్వహించారని కితాబునిచ్చారు. పశ్చిమబెంగాల్, బీహార్‌లో శ్రీరామనవమి సందర్భంగా అల్లర్లు జరగడాన్ని ఉదహరిస్తూ పంజాబ్‌లో ఏ అల్లర్లూ జరగకుండా చూశారని చెప్పారు. పంజాబ్‌లో మాన్ శాంతి భద్రతల నిర్వహణ బాగా చేస్తున్నారని కేజ్రీవాల్ చెప్పారు. ఆయన గురువారం మాన్‌తో కలిసి అమృత్‌సర్, పటియాలా, లూధియానా, ఫగ్వారా ప్రాంతాల్లో సీఎం ది యోగశాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. యూపీఎస్‌సీ (UPSC) పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారి కోసం పది ప్రత్యేక ఉచిత కోచింగ్ సెంటర్లు తెరవాలని కూడా మాన్ నిర్ణయించారు.

Updated Date - 2023-04-06T17:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising