Most popular Global Leader: మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ల జాబితాలో అగ్రస్థానంలో మళ్లీ మోదీ

ABN , First Publish Date - 2023-09-15T21:13:31+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాజాగా ప్రపంచవ్యాప్తంగా తనకున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. మోదీ 76 శాతం ఆమోదం రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన సర్వేలో మోదీ తిరిగి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.

Most popular Global Leader: మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ల జాబితాలో అగ్రస్థానంలో మళ్లీ మోదీ

న్యూఢిల్లీ: జి-20 సదస్సుకు ఆతిథ్యమిస్తూ విజయవంతంగా నిర్వహించడంలో సత్తా చాటుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తాజాగా ప్రపంచవ్యాప్తంగా తనకున్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. మోదీ 76 శాతం ఆమోదం రేటింగ్‌తో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా (Top Global Leader) మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన సర్వేలో మోదీ తిరిగి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. మోదీ నాయకత్వానానికి అప్రూవల్ రేటింగ్ 76 శాతంగా ఉండగా, డిసప్రూవల్ రేటింగ్ 18 శాతంగా, తటస్థంగా ఉండిన వారి రేటింగ్ 6 శాతంగా ఉంది.


కాగా, మోదీ తర్వాత స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెర్సెట్ 64 శాతం ఆమోదం రేటింగ్‌తో రెండో స్థానంలో నిలిచారు. మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లొపొజ్ అబ్రాడార్ 61 శాతం ఆమోదం రేటింగ్‌తో మూడో స్థానం పొందారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ 40 శాతం అప్రూవల్ రేటింగ్‌లోనూ, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడూ 27 శాతం, ఫ్రాన్స్ అధ్య మెక్రాన్ 24 శాతం అప్రూవల్ రేటింగ్‌లోనూ నిలిచారు.


భారత ప్రధాని నరేంద్ర మోదీ గత సర్వేలోనూ అగ్రస్థానంలో నిలవగా, జీ-20 విజయంతో ఆ అగ్రస్థానం మరోసారి పదిలమైంది. రెండ్రోజుల పాటు న్యూఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగిన జీ-20 సదస్సులో 40 మందికి పైగా ప్రపంచ నేతలు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-15T21:13:31+05:30 IST