ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Big Breaking: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్ కన్నుమూత!

ABN, First Publish Date - 2023-09-28T12:42:18+05:30

భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు తుది శ్వాస విడిచారు.

చెన్నై: భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ఇక లేరు. 98 ఏళ్ల వయసున్న స్వామినాథన్ చెన్నైలోని ఆయన నివాసంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచారు. 1925 ఆగష్టు 7న మద్రాసు ప్రెసిడెన్సీలోని కుంభకోణం ప్రాంతంలో స్వామినాథన్ జన్మించారు. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు విశేష కృషి చేశారు. అధిక దిగుబడినిచ్చే వరి రకాలను అభివృద్ధి చేయడంలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. ఇది భారతదేశంలోని తక్కువ ఆదాయం గల రైతులు ఎక్కువ దిగుబడిని ఉత్పత్తి చేయడానికి సహాయపడింది. స్వామినాథన్ 1987లో చెన్నైలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. దాని ద్వారా ఆయన మొదటి ప్రపంచ ఆహార బహుమతిని అందుకున్నారు. స్వామినాథన్ అనేక అవార్డులను అందుకున్నారు. 1971లో రామన్ మెగసెసే అవార్డు, 1986లో ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు అందుకున్నారు. అలాగే పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఇందిరా శాంతి బహుమతి, ఇందిరా జాతీయ సమైక్యతా పురస్కరాలు కూడా పొందారు. కాగా స్వామినాథన్‌కు భార్య మినా, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెల పేర్లు సౌమ్య స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా స్వామినాథన్.

Updated Date - 2023-09-28T13:00:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising