‘జ్ఞాన్‌వాపీ’ భూవివాదం కేసులపై రేపు అలహాబాద్ హైకోర్టు తీర్పు
ABN , Publish Date - Dec 18 , 2023 | 03:41 AM
కాశీ విశ్వనాథ మందిరం-జ్ఞానవాపీ వివాదంపై దాఖలైన పలు కేసులపై అలహాబాద్ హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతి

అలహాబాద్, డిసెంబరు 17: కాశీ విశ్వనాథ మందిరం-జ్ఞానవాపీ వివాదంపై దాఖలైన పలు కేసులపై అలహాబాద్ హైకోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనుంది. మసీదులో పూజలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ 1991లో హిందూ భక్తులు దాఖలు చేసుకున్న పిటిషన్ కూడా ఇందులో ఉంది. ఈ పిటిషన్ ప్రస్తుతం వారాణసి కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం ప్రకారం మసీదు స్వరూపాన్ని మార్చకూడదని, అందువల్ల ఆ పిటిషన్లను కొట్టివేయాలని కోరుతూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ, సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డులు దావాలు వేశాయి. వీటన్నింటిపై హైకోర్టు విచారించింది.