Share News

ATMs: మూడురోజులుగా పనిచేయని ఏటీఎంలు

ABN , First Publish Date - 2023-12-08T10:56:01+05:30 IST

నగరంలోని ఏటీఎం(ATM) కేంద్రాలు మూడు రోజులుగా పనిచేయకపోవడంతో ప్రజలు నగదు డ్రా చేసుకొనేందుకు వీలులేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పనిచేస్తున్న

ATMs: మూడురోజులుగా పనిచేయని ఏటీఎంలు

వేళచ్చేరి(చెన్నై): నగరంలోని ఏటీఎం(ATM) కేంద్రాలు మూడు రోజులుగా పనిచేయకపోవడంతో ప్రజలు నగదు డ్రా చేసుకొనేందుకు వీలులేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పనిచేస్తున్న కొన్ని ఏటీఎం కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు. తుఫాను కారణంగా సెల్‌ఫోన్‌ నెట్‌వర్క్‌ స్తంభించడం, వీధుల్లో భారీగా నీరు చేరడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోయారు. నీళ్లు తగ్గాక నిత్యావసర సరుకులు కొనేందుకు రాగా నెట్‌వర్క్‌ లేకపోవడంతో సెల్‌ఫోన్‌ ద్వారా నగదు చెల్లింపు సాధ్యం కాలేదు. దీంతో ఏటీఎం కేంద్రాలకు పరుగులు తీశారు. కానీ, అక్కడ విద్యుత్‌ సరఫరా, నెట్‌వర్క్‌ లేకపోవడంతో ఆ కేంద్రాలు మూతపడ్డాయి. దీంతో, పనిచేస్తున్న ఏటీఎం కేంద్రాలకు వెళ్లిన ప్రజలు భారీ క్యూలైన్‌లలో నిలబడి నగదు డ్రా చేసుకున్నారు.

Updated Date - 2023-12-08T10:56:02+05:30 IST