Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త

ABN , First Publish Date - 2023-03-01T18:02:17+05:30 IST

బ్యాంకు ఉద్యోగులకు ఇది నిశ్చయంగా శుభవార్తే. త్వరలోనే వారానికి రెండు రోజులు వీక్లీ ఆఫ్స్ విధానం రాబోతోంది. అంటే బ్యాంకులు..

Bank Employees: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త

న్యూఢిల్లీ: బ్యాంకు ఉద్యోగులకు ఇది నిశ్చయంగా శుభవార్తే. త్వరలోనే వారానికి రెండు రోజులు వీక్లీ ఆఫ్స్ విధానం రాబోతోంది. అంటే బ్యాంకులు వారంలో ఐదురోజులు మాత్రమే పనిచేస్తాయి. వారానికి ఐదు రోజుల పనిదినాల కోసం బ్యాంక్ యూనియన్లు చాలాకాలంగా డిమాండ్‌ చేస్తుండగా, దీనిపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) సీరియస్‌గా పరిశీలిస్తోందని తాజా సమాచారం.

వారంలో రెండు రోజుల వీక్లీ ఆఫ్స్‌ అమలుపై త్వరలోనే నిర్ణయం వెలువడుతుందని, ఇందుకు గాను తక్కిన ఐదు రోజుల పనిదినాల్లో ఉద్యోగులు ప్రతిరోజూ 50 నిమిషాల పాటు అందనంగా పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఈ దిశగా ఐబీఏ, బ్యాంక్ ఎంప్లాయీస్ యునైటెడ్ ఫోరం (యూఎఫ్‌బీఈ) మధ్య చర్చలు జరుగుతున్నాయి. 5 రోజుల పనిదినాలకు సూత్రప్రాయంగా అసోసియేషన్ అంగీకరించినట్టు చెబుతున్నారు.

నెగోషియబుల్ ఇన్‌స్ట్రమెంట్స్ యాక్ట్‌లోని సెక్షన్ 25 ప్రకారం అన్ని శనివారాలను సెలవుదినాలుగా ప్రభుత్వం నోటిఫై చేయనుందని ఆల్‌ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్.నాగరాజన్ తెలిపారు. ప్రస్తుతం వారం విడిచి వారం (రెండు, నాలుగు) శనివారాల్లో బ్యాంకులకు సెలవుల విధానం అమలవుతోంది. కాగా, ప్రతిరోజూ ఉద్యోగులు 9.45 నుంచి 5.30 వరకూ అదనంగా 40 నిమిషాలు పనిచేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.

Updated Date - 2023-03-01T18:02:17+05:30 IST