Nitish Kumar: ప్రతిపక్షాల ఐక్యతాయత్నాలు ముమ్మరం చేయనున్న నితీశ్
ABN, First Publish Date - 2023-05-08T22:47:46+05:30
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Bihar CM Nitish Kumar) మరోమారు ప్రతిపక్షాల ఐక్యత కోసం యత్నాలు ముమ్మరం చేయనున్నారు.
ముంబై: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్(Bihar CM Nitish Kumar) మరోమారు ప్రతిపక్షాల ఐక్యత కోసం యత్నాలు ముమ్మరం చేయనున్నారు. మే 11న ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌ను(Sharad Pawar), శివసేన ఉద్ధవ్ వర్గం అధినేత ఉద్ధవ్ థాకరేను (Uddhav Thackeray) కలుసుకోనున్నారు. ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించనున్నారు. నితీశ్ ఇప్పటికే కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతను, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ను, ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కలుసుకున్నారు. ఉమ్మడిగా బీజేపీని(BJP) ఎదుర్కోవాలని సూచించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Modi) ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాల తరపున ఒక్క అభ్యర్ధినే నిలపాలనే ప్రతిపాదన నితీశ్ తీసుకొచ్చారు. దీనిపై పార్టీల నేతలు లోతుగా చర్చిస్తున్నారు.
పాట్నాలో త్వరలో బీజేపీయేతర పార్టీల సమావేశం నిర్వహించాలని మమత సూచన ఇవ్వడంతో నితీశ్ నేతలందరినీ ఆహ్వానించే అవకాశం ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే పాట్నాల ప్రతిపక్ష పార్టీ నేతల కీలక సమావేశం ఉండే అవకాశం ఉంది.
Updated Date - 2023-05-08T22:47:49+05:30 IST