ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ganesh Chaturthi: గణపతి భక్తులకు శుభవార్త చెప్పిన బీజేపీ

ABN, First Publish Date - 2023-09-16T09:27:09+05:30

గణేష్ ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు మహారాష్ట్ర బీజేపీ శుభవార్త చెప్పింది. గణేష్ చతుర్థి సందర్భంగా కొంకణ్ వెళ్లే భక్తుల కోసం ఆరు ప్రత్యేక రైళ్లు, 338 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.

ముంబై: గణేష్ ఉత్సవాల నేపథ్యంలో భక్తులకు మహారాష్ట్ర బీజేపీ శుభవార్త చెప్పింది. గణేష్ చతుర్థి సందర్భంగా కొంకణ్ వెళ్లే భక్తుల కోసం ఆరు ప్రత్యేక రైళ్లు, 338 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ముంబయిలోని దాదర్ స్టేషన్ నుంచి కొంకణ్‌కు తొలి రైలు వెళ్లింది. 'నమో ఎక్స్‌ప్రెస్' పేరుతో ఏర్పాటు చేసిన ఈ గణపతి ప్రత్యేక రైలును మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ అగ్రనేత శుక్రవారం నాడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "రాబోయే గణపతి ఉత్సవాల కోసం కొంకణ్ ప్రాంతానికి వెళ్లే భక్తుల కోసం మహారాష్ట్ర బీజేపీ ఆరు ప్రత్యేక రైళ్లు, 338 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తద్వారా ప్రయాణీకులకు కొంకణ్ వెళ్లడానికి ఇబ్బందులు ఎదురుకావు. మా ముంబై బీజేపీ చీఫ్ ఆశిష్ షెలార్, క్యాబినెట్ మంత్రి మంగళ్ ప్రభాత్ లోధా, మా బృందం అంతా కలిసి ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా ఏర్పాట్లు చేయడానికి కృషి చేస్తున్నాము. ఈ సంవత్సరం మేము దానిని పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నిస్తున్నాము" అని తెలిపారు. కాగా మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలను విస్తృతంగా జరుపుకుంటారు. ముఖ్యంగా కొంకణ్‌లోని గణపతి ఆలయానికి భక్తులు భారీగా తరలివెళతారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా కొంకణ్‌లో కొలువైన గణపతిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. మరోవైపు గణపతి పండుగను దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ రైల్వే కూడా 156 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వాటికి సంబంధించి ఇప్పటికే బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. కాగా ఈ సంవత్సరం గణేష్ చతుర్థి ఉత్సవాలు సెప్టెంబర్ 19 న ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 29 వరకు అంటే పది రోజుల పాటు కొనసాగుతాయి. అనంత్ చతుర్దశి రోజైన సెప్టెంబర్ 29న గణపతి విగ్రహాన్ని బహిరంగ ఊరేగింపుతో తీసుకువెళ్లి విసర్జన్ అని పిలువబడే నది లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు.

Updated Date - 2023-09-16T09:27:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising