Modi: ప్రధాని మోదీ పాల్గొనే సభకు వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సుకు ఘోర ప్రమాదం.. 39 మందికి గాయాలు
ABN, First Publish Date - 2023-09-25T10:37:08+05:30
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోల్ జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు హాజరుకావడానికి బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని ఖర్గోల్ జిల్లాలో( Khargone) అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే సభకు హాజరుకావడానికి బీజేపీ కార్యకర్తలతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. బీజేపీ కార్యర్తలతో వెళ్తున్న బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 39 మంది బీజేపీ కార్యర్తలు గాయపడ్డారు. వారంతా సోమవారం భోపాల్‌లో జరిగే 'కార్యకర్త మహాకుంభ్'(Karyakarta Mahakumbh) సభలో పాల్గొనడానికి వెళ్తున్నారు. ఈ సభలో ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభలో పాల్గొనడానికి వెళ్తున్న బస్సు కస్రవాడ సమీపంలో అర్థరాత్రి ప్రమాదానికి గురైంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సులో ఎక్కువగా ఖపర్జమ్లీ, రూప్‌గఢ్, భగవాన్‌పురా, రాయ్ సాగర్‌కు చెందిన బీజేపీ కార్యకర్తలు ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సాగిన బీజేపీ 'జన్ ఆశీర్వాద యాత్ర' అధికారిక ముగింపు, జనసంఘ్ సహ వ్యవస్థాపకుడు దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఈ 'కార్యకర్త మహాకుంభ్' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఈ 'మహాకుంభ్' కార్యక్రమాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ కార్యక్రమానికి 10 లక్షల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా తమ పార్టీ బలంపై ఓ అంచనాకు రావొచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. కాగా అధికార పార్టీ కాంగ్రెస్‌తో గట్టి పోటీని ఎదుర్కొంటున్న మధ్యప్రదేశ్‌లో గత 45 రోజులలో ప్రధాని మోదీ పర్యటించడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
Updated Date - 2023-09-25T10:37:08+05:30 IST