ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kavitha In Delhi: హస్తినలో కవిత దీక్షకు లైన్ క్లియర్

ABN, First Publish Date - 2023-03-09T17:32:35+05:30

ఎమ్మెల్సీ కవిత (BRS MLC K Kavitha) చేయాలనుకున్న నిరాహార దీక్షకు లైన్ క్లియర్ అయింది.

BRS MLC K Kavitha hunger strike at Delhi Jantar Mantar
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: హస్తిన(Delhi)లో మహిళా రిజర్వేషన్ బిల్లు(Women’s Reservation Bill) కోసం జంతర్‌ మంతర్(Jantar Mantar) దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC K Kavitha) చేయాలనుకున్న నిరాహార దీక్షకు లైన్ క్లీయర్ అయింది. కవిత దీక్షకు జంతర్ మంతర్ వేదిక ఖరారు కాగా లిక్కర్ స్కామ్‌(Delhi liquor scam)కు వ్యతిరేకంగా ఢిల్లీ బీజేపీ నేతలు చేయాలనుకున్న ధర్నా జంతర్‌మంతర్ నుంచి దీన్‌దయాళ్‌ మార్గ్‌కు మారింది. దీన్‌దయాళ్‌ మార్గ్‌లోని ఆంధ్రా స్కూల్‌ దగ్గర బీజేపీ ధర్నా నిర్వహించనుంది. దీంతో రేపు ఢిల్లీలో బీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీ నిరసనలు నిర్వహించనున్నాయి.

ఒకరోజు ముందే హస్తిన చేరుకున్న కవిత ఇవాళ ఉదయం ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు(Delhi liquor scam)లో ఈడీ నోటీసులపై స్పందించారు. 9న విచారణకు రావాలని ఈడీ(ED) నోటీసు ఇచ్చిందని, 11న విచారణకు తమ ఇంటికి రమ్మని ఈడీని కోరానన్నారు. ఈమేరకు ఈడీకి సమాచారం ఇచ్చినా ఈడీ ఒప్పుకోలేదన్నారు. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఎందుకు విచారించరని కవిత ప్రశ్నించారు. దర్యాప్తు సంస్థలు మహిళ ఇంటికి వచ్చి విచారించాలన్నది చట్టం చెబుతోందని, మహిళలను విచారించే పద్ధతిపై అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. ఇది తన ఒక్క సమస్యే కాదని, ఈడీ ఎందుకింత హడావుడిగా దర్యాప్తు చేస్తుందో అర్థం కావడం లేదని కవిత చెప్పారు. తనతోపాటు ఎవర్ని విచారించినా తనకు ఇబ్బంది లేదన్నారు.

ఎన్నికల నేపథ్యంలో అధికారంలో లేని రాష్ట్రాల్లో మోడీ కంటే ముందు ఈడీ వస్తోందని కవిత ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేశారని, అది సాధ్యం కాకపోవడంతో తనను టార్గెట్ చేశారని ఆమె ఆరోపించారు. దర్యాప్తు సంస్థలతో తమ పార్టీ నేతలను వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. తమ పార్టీకి చెందిన సుమారు 15 మంది నేతలపై దర్యాప్తు సంస్థల దాడులు జరిగాయని ఆమె గుర్తు చేశారు. మోదీ వన్‌ నేషన్ - వన్ ఫ్రెండ్ స్కీమ్‌ తెచ్చారని, విపక్షాలను టార్గెట్ చేయడం పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అధిక ధరలు, నిరుద్యోగాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని ఆమె కేంద్రానికి సలహా ఇచ్చారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బీజేపీలో చేరగానే క్లీన్‌చిట్ ఇస్తున్నారని కవిత చెప్పారు. తాము ఎవరికీ బీ టీమ్‌ కాదని, ఎప్పటికీ ఏ టీమేనన్నారు. తన తండ్రి, సోదరుడితో పాటు పార్టీ మొత్తం అండగా ఉంటుందన్నారు. తెలంగాణ నేతల్ని విచారించడం కేంద్రానికి అలవాటైపోయిందన్నారు. మోదీ పార్లమెంట్‌లో కూడా అబద్దాలు చెబుతున్నారని, గాంధీ పుట్టిన దేశంలో అబద్ధం రాజ్యమేలుతోందన్నారు. మోదీ ఎన్ని కుట్రలు చేసినా ధర్మం గెలుస్తుందని కవిత చెప్పారు. తాను ధైర్యంగా ఈడీ విచారణకు వెళ్తున్నా బీఎల్ సంతోష్ ఎందుకు భయపడుతున్నారని కవిత ప్రశ్నించారు.

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా బిల్లు కోసం 27 ఏళ్లుగా పోరాటం జరుగుతోందని కవిత చెప్పారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా బిల్లు ఆమోదం పొందలేదన్నారు. 2014, 2018 మహిళా బిల్లుపై బీజేపీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారని కవిత గుర్తు చేశారు. మహిళా బిల్లును కోల్డ్‌ స్టోరేజ్‌లో పెట్టారని విమర్శించారు. మహిళా బిల్లు ఆమోదం కోసం ఈ నెల 10న ఢిల్లీలో నిరాహార దీక్ష చేపడతానని, రేపటి ధర్నాలో 18 పార్టీలు పాల్గొంటాయని ఆమె చెప్పారు. పూర్తి మెజార్టీతో గెలిపించినా మహిళా బిల్లుపై బీజేపీ మాట తప్పిందని, మహిళా బిల్లుపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు తేవడంలో సోనియా పాత్ర అమోఘమని కవిత చెప్పారు.

మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం(Delhi liquor scam)తో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (BRS MLC K Kavitha) తెలంగాణ పరువు తీశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) చెప్పారు. లిక్కర్‌ స్కామ్‌పై అన్నా చెల్లెలు (KTR, Kavitha) ఇద్దరూ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆయన కేటీఆర్, కవితలను ఉద్దేశించి అన్నారు. బీఆర్ఎస్‌ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అబద్ధాలు చెప్పడంలో బీఆర్ఎస్ నేతలను మించినవారు లేరని కిషన్‌రెడ్డి చెప్పారు. ఢిల్లీ వెళ్లి ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి లిక్కర్‌ స్కామ్‌ చేయాలని చెప్పామా అంటూ ఆయన కేటీఆర్, కవిత(KTR, Kavitha)లను ఉద్దేశించి ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే హక్కు కల్వకుంట్ల ఫ్యామిలీకి లేదన్నారు. లిక్కర్‌ స్కామ్‌పై దృష్టి మళ్లించేందుకే ఢిల్లీలో ధర్నా నాటకాలు ఆడుతున్నారని, సానుభూతి కోసమే బీఆర్‌ఎస్‌ డ్రామాలాడుతోందని కిషన్ రెడ్డి చెప్పారు.

మద్యం కేసు రాగానే మహిళా రిజర్వేషన్ గుర్తుకొచ్చిందా అని కిషన్‌రెడ్డి ఎమ్మెల్సీ కవితను ఎద్దేవా చేశారు. తప్పు చేయకపోతే భుజాలు ఎందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు. లక్షల విలువైన సెల్‌ఫోన్లను ఎందుకు ధ్వంసం చేశారని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్, కవిత, బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేయాల్సినంత గొప్పవాళ్లు కాదని కిషన్ రెడ్డి చెప్పారు. అక్రమ వ్యాపారంలో ఇరుక్కుపోయి, అక్రమాలు చేస్తూ మోదీని తప్పుపడతారా అని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Updated Date - 2023-03-09T17:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising