ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM MODI: మోదీతో వేగేదెలా?

ABN, First Publish Date - 2023-09-25T02:57:52+05:30

ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్‌(India) వంటి విశాలమైన మార్కెట్‌ను వదులుకోలేని ఆర్థిక అవసరాలు; తమకు పోటాపోటీగా, పక్కలోబల్లెంలా నిలుస్తున్న చైనాను ఆసియాలో నిలువరించటానికి భారత్‌తో ఉన్న వ్యూహాత్మక అవసరాలు.. ఇదంతా ఒకవైపు; నరేంద్రమోదీ(MODI) వంటి ఆధిపత్య భావజాలంతో కూడిన నాయకుడితో తలెత్తుతున్న వైరుధ్యాలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ క్రమంగా నిరంకుశత్వం వైపుగా పయనిస్తున్నదన్న ఆందోళనలు మరోవైపు.. ఈ రెండింటి మధ్య అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాయి.

కెనడా-భారత్‌ వివాదం.. సంకటంలో అగ్రదేశాలు

రాజకీయ, భౌగోళిక అవసరాల దృష్ట్యా

భారత్‌కు ప్రాధాన్యమివ్వక తప్పని పరిస్థితి

మోదీ నిరంకుశ వ్యవహారశైలిపై

పెరుగుతున్న ఆందోళన మరోవైపు

తేల్చుకోలేని స్థితిలో ప్రపంచ నేతలు

ట్రూడో ఆరోపణలు నిజమని

తేలితే నిశ్శబ్దాన్ని వీడే అవకాశం

పరిస్థితిని విశ్లేషిస్తూ న్యూయార్క్‌టైమ్స్‌,

ఫైనాన్షియల్‌ టైమ్స్‌లో వ్యాసాలు

(సెంట్రల్‌డెస్క్‌) : ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న భారత్‌(India) వంటి విశాలమైన మార్కెట్‌ను వదులుకోలేని ఆర్థిక అవసరాలు; తమకు పోటాపోటీగా, పక్కలోబల్లెంలా నిలుస్తున్న చైనాను ఆసియాలో నిలువరించటానికి భారత్‌తో ఉన్న వ్యూహాత్మక అవసరాలు.. ఇదంతా ఒకవైపు; నరేంద్రమోదీ(MODI) వంటి ఆధిపత్య భావజాలంతో కూడిన నాయకుడితో తలెత్తుతున్న వైరుధ్యాలు, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ క్రమంగా నిరంకుశత్వం వైపుగా పయనిస్తున్నదన్న ఆందోళనలు మరోవైపు.. ఈ రెండింటి మధ్య అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్నాయి. ప్రజాస్వామ్యం వైపు నిలబడాలా? పెట్టుబడిదారీ వ్యవస్థకు ప్రాణసమానమైన మార్కెట్‌ అవసరాల వైపు నిలబడాలా? తేల్చుకోలేని పరిస్థితి. కెనడా-భారత్‌ వివాదం ఈ డోలాయమానాన్ని మరింత పెంచిందని అమెరికా, బ్రిటన్‌లకు చెందిన రెండు ప్రముఖ పత్రికలు విశ్లేషించాయి. అమెరికాలోని న్యూయార్క్‌ టైమ్స్‌(New York Times in America), బ్రిటన్‌లోని ఫైనాన్షియల్‌ టైమ్స్‌(Financial Times) శుక్రవారం రెండు వ్యాసాలను ప్రచురించాయి.

అమెరికా జర్నలిస్టు నికొలస్‌ క్రిస్టఫ్‌ న్యూయార్క్‌టైమ్స్‌లో ‘ఎ మర్డర్‌, ఎ డిప్లొమాటిక్‌ డస్టప్‌ అండ్‌ రిస్క్‌ ఆఫ్‌ ఇంప్యూనిటీ’ శీర్షికన ఒక వ్యాసం రాశారు. ప్రతిష్ఠాత్మక పులిట్జర్‌ పురస్కారాన్ని రెండుసార్లు గెల్చుకున్న నికొలస్‌ అమెరికాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమొక్రటిక్‌ పార్టీ సభ్యుడు కూడా. ఆయన వ్యాసంలోని ముఖ్యాంశాలు..

1980ల ప్రారంభంలో భారత్‌లో ఖలిస్థాన్‌కు మద్దతుగా ఓ హింసాత్మక వేర్పాటువాద ఉద్యమం ప్రజ్వరిల్లింది. అప్పట్లో నేను లా స్టూడెంట్‌ను. ఓ బ్యాగు భుజాన వేసుకొని భారత్‌లో తిరుగుతున్నా. డబ్బులను మిగుల్చుకోవటానికి పంజాబ్‌లో సిక్కుల స్వర్ణదేవాలయం అరుగుల మీద పడుకునేవాణ్ని. ఆ సమయంలో ఖలిస్థాన్‌ ఉద్యమ నేతలను కలిసి మాట్లాడాను. అనంతరకాలంలో ఆ ఉద్యమం నీరుగారిపోయింది. ఇప్పుడు ఖలిస్థాన్‌ అనే స్వప్నం భారతదేశంలో కంటే విదేశాల్లో ఉన్న భారతీయుల (సిక్కుల) మధ్యే ఎంతోకొంత సజీవంగా ఉంది.

హర్‌దీ్‌పసింగ్‌ నిజ్జర్‌ హత్యకు సంబంధించి భారత్‌ అబద్ధమాడుతోందని తేలితే, అంతర్జాతీయంగా తన ప్రతిష్ఠను తనంతటతానే నష్టపరుచుకున్నట్లవుతుంది. నిజ్జర్‌ జీవించి ఉన్నా కూడా భారత్‌కు ఇంత నష్టం చేసి ఉండగలిగే వాడు కాదు. ప్రజాస్వామ్యయుత పశ్చిమదేశాల్లో ఏదైనా ఒక విదేశీ ప్రభుత్వం.. హత్య ఆరోపణల నుంచి బయటపడాలంటే, తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. 1984లో అమెరికాలోని కాలిఫోర్నియాలో తైవాన్‌ మూలాలున్న అమెరికా జర్నలిస్టు హెన్రీల్యూ హత్యకు గురయ్యారు. తైవాన్‌ అప్పటి నియంత జీవితంపై హెన్రీ విమర్శనాత్మక వ్యాసం రాసిన నేపథ్యంలో ఇది జరిగింది. అనంతరకాలంలో, ఈ నేరానికి తైవాన్‌ తన సైనిక నిఘా విభాగం అధిపతిపై న్యాయవిచారణ జరిపించి, యావజ్జీవ జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత కొంతకాలానికి అమెరికా-తైవాన్‌ సంబంధాలు కుదుటపడ్డాయి.


హర్‌దీ్‌పసింగ్‌ నిజ్జర్‌ హత్య విషయంలో భారత ప్రధాని నరేంద్రమోదీ ఇటువంటి చర్యలేమీ తీసుకోవటం లేదు. ఆ హత్యపై దర్యాప్తు జరిపిస్తున్న సూచనలేమీ లేవు. పైగా జాతీయవాదాన్ని రెచ్చగొట్టటం ద్వారా ఆ ఘటన నుంచి రాజకీయంగా ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారు. రాజకీయాల్లో తన కెరీర్‌ను ఆయన తొలినుంచీ ఈ విధంగానే నిర్మించుకుంటూ వస్తున్నారు. ముస్లిం జిహాదీల నుంచి, సిక్కు వేర్పాటువాదుల నుంచి, ఇంకా చెప్పాలంటే పశ్చిమ దేశాల సామ్రాజ్యవాదుల నుంచి భారతదేశంలోని మెజారిటీ హిందువులను రక్షించే యోధానుయోధుడిగా మోదీ తనను తాను ప్రచారం చేసుకుంటున్నారు. ఈ ప్రచారం ఆయనకు బహుశా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉపయోగపడవచ్చు. దాదాపు అర్ధ శతాబ్దం కిందట పాకిస్థాన్‌లో మతపరమైన ఉన్మాదాన్ని రెచ్చగొట్టి, విశృంఖలంగా ఆ ఉన్మాదాన్ని వ్యాప్తి చేసిన జనరల్‌ మహమ్మద్‌ జియా ఉల్‌ హక్‌ మాదిరిగానే మోదీ వైఖరి కనిపిస్తోంది. ఇది భారత్‌ను అస్థిపరిచే ప్రమాదం ఉందని నేను ఆందోళన చెందుతున్నా. భారత్‌ చాలా కీలకమైన దేశం. అందువల్లే, భారత్‌తో కెనడా పెట్టుకున్న పోట్లాటలో తలదూర్చాలని ఇతర దేశాలేవీ కోరుకోవటం లేదు. ఒక విధంగా చెప్పాలంటే అవి ఈ వివాదం నుంచి తలతిప్పుకుంటున్నాయి. 2018లో బ్రిటన్‌లో ఒక రష్యా దేశస్థుడు హత్యకు గురైతే అమెరికా తమ దేశం నుంచి 60 మంది రష్యన్లను బహిష్కరించింది. 14 యూరప్‌ దేశాలూ అదే విధమైన చర్యలు చేపట్టాయి. ఒక దేశానికి మనం ప్రాధాన్యం ఇస్తున్నంతమాత్రాన, ఆ దేశానికి చెందిన హంతకులు వచ్చి యథేచ్ఛగా హత్యలు చేయటానికి అనుమతించలేం కదా!

భారత ప్రభుత్వంపై కెనడా ప్రధాని ట్రూడో చేసిన ఆరోపణలు సంచలనాత్మకమైనవి. అవి నిజమని తేలితే పశ్చిమ దేశాలు.. ప్రధాని మోదీతో, రోజురోజుకీ శ్రుతిమించుతున్న ఆయన నిరంకుశ ప్రభుత్వంతో వ్యవహరించే విషయంలో ఒక హెచ్చరికగా దానిని తీసుకోవాల్సి ఉంటుంది. మోదీ పట్ల ఎనలేని సానుకూలత చూపుతున్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తోపాటు పశ్చిమ దేశాల అధినేతలకు ఈ మొత్తం వ్యవహారం ఒక పెద్ద హెచ్చరిక. జాతీయవాద నిరంకుశ పాలకులను సంస్కరించటానికి చేసే ప్రయత్నాలు విజయం సాధించబోవని కొన్ని దశాబ్దాలుగా రష్యా అధిపతి పుతిన్‌తో ఉన్న అనుభవాలు మనకు పాఠాలు నేర్పిస్తున్నాయి’ అంటూ నికొలస్‌ క్రిస్టఫ్‌ ఒక హెచ్చరికతో తన వ్యాసాన్ని ముగించారు.

ఫైనాన్షియల్‌ టైమ్స్‌లో ‘ది వెస్ట్స్‌ మోదీ ప్రాబ్లమ్‌’ శీర్షికన ప్రచురితమైన వ్యాసంలో ముఖ్యాంశాలు..

భారత్‌-కెనడా వివాదం జీ20లోని రెండు సభ్యదేశాలకు పరిమితమైన సమస్య మాత్రమే కాదు. చైనాను వ్యతిరేకించే తమతోటి ప్రజాస్వామ్య మిత్రదేశంగా భారత్‌కు అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలు అమిత ప్రాధాన్యమిస్తున్నాయి. భౌగోళిక, రాజకీయ వ్యూహాత్మకతల దృష్ట్యా అవి భారత్‌కు మాత్రమే కాదు వ్యక్తిగతస్థాయిలో మోదీకీ సముచిత స్థానం ఇస్తున్నాయి. తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉన్న మోదీ స్వదేశంలో రాజకీయంగా గట్టి పునాదిని నిర్మించుకోవటంతోపాటు అంతర్జాతీయంగానూ బలమైన నాయకుడిగా తనను తాను ప్రచారం చేసుకున్నారు. కానీ మోదీ, ఆయన పార్టీ బీజేపీలోని కీలక నేతలు భారత్‌తోపాటు విదేశాల్లో కూడా మతపరమైన విద్వేషాన్ని, భావోద్వేగాలను రెచ్చగొడుతున్నట్లు ఆరోపణలు బలంగా ఉన్నాయి. జర్నలిస్టులను, పౌరసమాజంలోని కార్యకర్తలను, సంస్థలను వేధిస్తున్నారని, భారతదేశ లౌకిక విలువలను తుంగలో తొక్కుతున్నారని విమర్శలున్నాయి. పశ్చిమదేశాలు ఈ విషయంలో తమ అభిప్రాయాలను తూతూమంత్రంగా వెల్లడించటానికో, అంతరంగిక సమావేశాల్లో మాత్రమే చెప్పటానికో పరిమితమయ్యాయి. భారత్‌తో సంబంధాల దృష్ట్యా అవి అలా వ్యవహరిస్తున్నాయి. కానీ, కెనడా ఆరోపణలు నిజమని తేలితే అవి ఇప్పటిలాగే నిశ్శబ్దంగా ఉండలేకపోవచ్చు.

Updated Date - 2023-09-25T04:01:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising