ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Budget2023: బడ్జెట్‌‌లో డబ్బు ఎక్కువగా కేటాయించిన రంగం ఏదో తెలుసా..

ABN, First Publish Date - 2023-02-01T15:01:49+05:30

ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశ ఆదాయ, వ్యయాలు, లక్ష్యాలకు సంబంధించిన బడ్జెట్ 2023ను (Budget2023) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరం 2023-24లో దేశ ఆదాయ, వ్యయాలు, లక్ష్యాలకు సంబంధించిన బడ్జెట్ 2023ను (Budget2023) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. సమ్మిళిత వృద్ధి, చిట్టచివరి వ్యక్తికి కూడా లబ్ధి, మౌలిక సదుపాయాలు- పెట్టుబడులు, సామర్థ్యాలను వెలికితీయడం, హరిత వృద్ధి, యువశక్తి, ఆర్థికరంగం బలోపేతం అనే సప్తర్షి లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్‌ ప్రతిపాదనలున్నాయి. తదనుగుణంగానే కీలకమైన రంగాలకు కేటాయింపుల్లో ప్రాధాన్యత దక్కింది. మరి ఏయే రంగాలకు ఏవిధమైన కేటాయింపులు జరిగాయో ఒకసారి పరిశీలిద్దాం...

రక్షణమంత్రిత్వశాఖకు (Defence Sector) అత్యధికంగా రూ.5.94 లక్షల కోట్లను కేంద్రప్రభుత్వం (Central Govt) కేటాయించింది. ఒక పక్క చైనా(China), మరోపక్క పాకిస్తాన్ (Pakistan) నుంచి సవాళ్లు పెరిగిపోతుండడం, అంతర్జాతీయ రాజకీయ పరిణామాల దృష్ట్యా రక్షణరంగ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం మరోసారి ప్రాధాన్యత ఇచ్చింది. నూతన ఆయుధాల సేకరణ, దేశీయంగా తయారీకి ఊతమివ్వడమే లక్ష్యంగా ఈ భారీ బడ్జెట్‌ను కేటాయించింది. రక్షణరంగం తర్వాత రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వశాఖకు రూ.2.70 లక్షల కోట్లను కేంద్రం ప్రకటించింది. ఇక రైల్వే మంత్రిత్వశాఖకు రూ.2.41 లక్షల కోట్లు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీల శాఖకు రూ.2.06 లక్షల కోట్లు, కేంద్ర హోంమంత్రిత్వశాఖకు రూ.1.96 లక్షల కోట్లు, ఎరువులు, రసాయనాల మంత్రిత్వశాఖకు రూ.1.78 లక్షల కోట్లు, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు రూ.1.60 లక్షల కోట్లు, వ్యవసాయం, రైతు సంక్షేమ మంత్రిత్వశాఖకు రూ.1.25 లక్షల కోట్లు, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్‌కు రూ.1.23 లక్షల కోట్లు చొప్పున కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ మేరకు బడ్జెట్ 2023-24లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది.

Updated Date - 2023-02-01T15:01:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising